-
-
అక్షర
Akshara
Author: Sudhama
Publisher: Sri Vedagiri Communications
Pages: 320Language: Telugu
'అడుగుజాడ గురజాడది- అది భావికి బాట' అని శ్రీశ్రీ అన్నా, '1915లో మరణించాకే గురజాడ జీవించడం ప్రారంభించాడు' అని కృష్ణశాస్త్రి అన్నా - అది యథార్థం! గురజాడ కచ్చితంగా ఒక 'శతాబ్ది సూరీడు'. ఒక 'కన్యాశుల్కం' నాటకమో, 'ముత్యాలసరాలు' ఛందమో ఆయనకి చిరంజీవత్వాన్ని ఇచ్చేయలేదు. జాతి వర్తమానాన్ని సుదూర భవితవ్యంతో ముడివేసి, పాతకొత్తల క్రొమ్మెరుంగులు చిమ్ముతూ, కేవలం సాహిత్యంలోనే కాకుండా భాషలోనూ - ప్రజాదృక్పథాన్నీ, జీవితంలో, ఆలోచనలో హేతుబద్ధమూ, మానవీయమూ అయిన వైఖరి అవలంబించబట్టి ఆయన 'యుగకర్త' అయ్యాడు.
బ్రతికి వుండగానే విమర్శలెదుర్కొన్న కవి, మరణించి నిజంగా బ్రతకడం మొదలుపెట్టాక - ఏ పునర్మూల్యాంకనల పేరుతోనో, ఎవరికివారు తెచ్చుకున్న తూనికరాళ్ళ కొలమానాల్లో, హెచ్చులు పోయే కొందరు విమర్శకులచే తగ్గించబడే రాతల పాలయినమాట నిజమే! కులం, మతం, ప్రాంతం అనే హ్రస్వదృష్టులకతీతంగా గురజాడను చూడడం ఈ జాతి ఎప్పటికి నేర్చుకుంటుందో? అందుకే శ్రీశ్రీ ఒకచోట అన్నాడు - ''గురజాడను కవిగా గుర్తించలేని 'వెధవాయను' మనిషిగా నేను గుర్తించలేను. 'మనవాళ్ళు ఉత్తవెధవాయలోయ్' అని గిరీశం చేత ఊరికే అనిపించలేదు గురజాడ.''
- సుధామ
