• Akasavani Parimalalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 144
    160
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆకాశవాణి పరిమళాలు

    Akasavani Parimalalu

    Pages: 169
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రజ్యోతి దినపత్రికలో మిత్రులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ నా జన్మదిన సందర్భంగా ఒక వ్యాసం వ్రాశారు. అందులో ఆయన - డి.వి. నరసరాజు తన ఆత్మకథకు “అదృష్టవంతుని ఆత్మకథ' అని పేరు పెట్టారనీ, అది అనంత పద్మనాభరావు విషయంలో సరిగ్గా సరిపోతుందని చమత్కరించారు.

అవును నేను అదృష్టవంతుడినే. కళాశాల అధ్యాపకుడిగా పదవీ విరమణ చేయవలసిన నేను ప్రసార భారతిలో చేరి 30 సంవత్సరాలలో మూడు ప్రమోషన్లు UPSC ద్వారా సంపాదించి 2005 ఫిబ్రవరి నెలాఖర్లో దూరదర్శన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా రిటైరు కావడం ఉద్యోగ సోపానంలో అదృష్టం.

కుటుంబ పాలనలో అనుకూలవతి, నా మనసెరిగి నా ఆరోగ్య పరిరక్షణ చేసి 50 సంవత్సరాలు నా సహధర్మచారిణిగా రచయిత్రి శోభాదేవి లభించడం మరింత అదృష్టం. ముగ్గురు పిల్లలు - శైలజ, రమేష్ చంద్ర, జనార్దన్ వారి వారి ఉద్యోగ రంగాలలో లబ్ధప్రతిష్ఠులు కావడం భగవంతుడిచ్చిన వరం. నా మనుమలు ఐదుగురు. జయంత్ (యు.ఎస్.ఏ., ఎం.ఎస్.), వసంత్ (బి.టెక్) ఉద్యోగాలలో చేరారు. మిహిర్ (16) ఫుట్‌బాల్ ఆటగాడుగా ఖ్యాతి సంపాదించాడు. మయాంక్, అంశుల్ కళాశాల దశకు చేరుకుంటున్నారు.

పదవీ విరమణానంతరం 5 ఏళ్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేయడం అదృష్టం. ఒక దశాబ్ద కాలంగా సివిల్ సర్వీసు అభ్యర్థుల విజయోత్సాహానికి దోహదం చేసే వృత్తిలో పేరు సంపాదించడం అదృష్టం. వందలాది ప్రముఖుల పరిచయాలు, మిత్రుల ప్రగాఢ స్నేహాలు దైవదత్తం. అందుకే ఇది అదృష్టవంతుని ఆత్మకథ.

- డా. ఆర్. అనంతపద్మనాభరావు

Preview download free pdf of this Telugu book is available at Akasavani Parimalalu