-
-
ఆకాశంలో సగం
Akasamlo Sagam
Author: Volga
Publisher: Swechcha Prachuranalu
Language: Telugu
Description
ఆకాశంలో సగం
ఓల్గా
ఈ నవలకి " ఉదయం"వారపత్రిక 1990 నవలలో పోటీలో ప్రథమ బహుమతి లభించింది.
“ఆ స్కూలు చాలా మంచి స్కూలు. గుంటూర్లోని మధ్య తరగతి కుటుంబాల పిల్లలందరూ ఆ స్కూల్లో చదవాలనుకుంటారు. హాస్టల్లోనే ఉన్నా, బడి ఆవరణ దాటి ఎప్పుడూ బైటకి వెళ్ళలేకపోయినా మిగిలిన పిల్లల ద్వారా ప్రపంచమంతా జసింత దగ్గరికి వచ్చేది. జసింతకి స్నేహితులెక్కువ. పుస్తకాలంటే ప్రాణం.
అమ్మగార్ల మాటకు ఎదురు చెప్పకుండా శ్రద్ధగా చదివి పదో తరగతి పాసయింది. ఇంటర్ కూడా ఆ స్కూల్లోనే ఉండి చదివి పాసయింది.
ఇక చదివింది చాల్లేమ్మనే పోరు ఇంటి దగ్గర ఎక్కువవుతున్నా జసింత పంతంబట్టి బిఏ లో చేరింది. ఏసి కాలేజిలో సీటు దొరికింది గానీ, హాస్టల్లో సీటు దొరకలేదు. బైట గది దొరకడం గగనమైంది. చిన్న గది సంపాదించి వండుకుని తింటూ మొదటి ఆరునెలలూ ఎలాగో నెట్టుకొచ్చింది.”
Preview download free pdf of this Telugu book is available at Akasamlo Sagam
Login to add a comment
Subscribe to latest comments
