-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఆకాశంలో అర్ధభాగం (free)
Akasamlo Ardhabhagam - free
Author: Dr. P. Vijayalakshmi Pandit
Publisher: R.C. Reddy Publications
Pages: 84Language: Telugu
స్త్రీల సమస్యల పట్ల లోతైన స్పందన, నిండైన సహానుభూతి ఈ కవితల లక్షణం. పేరుకిది కవితా సంకలనమే ఐనా, ‘స్త్రీ సమస్య’ అనే ఏకైక వస్తువు లక్ష్యంగా ఝుళిపించిన కలం కత్తితో ప్రజ్వలించే ఒక ఝాన్సీలక్ష్మీ హృదయం పూసల్లో దారంలా ప్రత్యక్షంలో ప్రసరిస్తున్నది. మగజాతి దౌర్జన్యాల పట్ల, సమాజంలో అడుగడుగునా ఆడవారికి మీదికి కోరలు చాస్తున్న బలివేదికల పట్లా అంచులు దిద్దుకున్న అసహనం, అసహ్యం, బాధ, క్రోధం ఈ కవితల్లో ప్రస్ఫుటమౌతుంది.
“ఆకాశంలో అర్ధభాగం” అంటే - మానవ జీవితంలోనే కాక, సాంకేతిక వైజ్ఞానిక అభ్యున్నతి క్రమంలో మానవ సమాజ ప్రగతని అనుక్షణం సరిసమానంగా నిర్వహిస్తున్న స్త్రీ" - అని ప్రతీక ఈ కృతిలో అలాంటి “స్త్రీ” అనుభవపూర్వకంగా పడుతున్న కష్టనష్టాలనూ, అలమటించే అన్ని దశలనూ దిశలనూ, అన్ని కవితల్లోనూ సమగ్రంగా వర్ణించారు. “కవితా విశారధ" ఈ కవయిత్రి. స్త్రీ మానసిక వేదన, గృహ హింస, పురుష సమాజం నిరాదరణలో, నిర్దాక్షిణ్యంలో ప్రస్తుత సమాజంలోని ఎగుడు దిగుళ్ళు, ఒడుదుడుకుల వల్ల కలుగుతున్న కష్టాలు, కన్నీళ్ళూ అన్ని కరుణా విలచిత్తంతో చిత్రించడం జరిగింది. “ఏకోరసః కరుణ ఏవ” అన్న ఆర్యోక్తికి ఒక బలమైన నిదర్శనం ఈ కవితా సంపుటి.
- ఆచార్య రావికంటి వసునందన్

- FREE
- FREE
- FREE
- FREE
- ₹60
- ₹60