-
-
ఆకాశం నీ హద్దురా!
Akasam Nee Haddura
Author: Suresh Veluguri
Publisher: VMRG International
Pages: 91Language: Telugu
నిజమైన వ్యక్తిత్వ వికాసం ...
వ్యక్తిత్వవికాసం ఈరోజు ఒక లాభసాటి వ్యాపారంగా మారిపోయిన క్రమంలో ... విద్యార్థుల నిజమైన వికాసానికి అవసరమైన అంశాలన్నీ దారితప్పాయి. నిజానికి ఏ విద్యార్థీ తెలివితేటలు, సామర్థ్యాలు లేనివాడు కాదు. వారిలో సహజంగా వున్న ఆసక్తిని బలపరచడం ద్వారా తప్ప, బలవంతాన ఏ పిల్లాడినీ మార్చలేం. కానీ, దురదృష్టవశాత్తూ, ప్రధానంగా కొందరు రచయితలు ... వ్యక్తిత్వవికాసం పేరుతో అమ్ముడుపోయే సరుకుల్ని సృష్టించే మార్కెట్‌గా ఏర్పడిపోయారు. ఎంత తక్కువ సామర్థ్యాలున్న పిల్లలనైనా తమ ప్రసంగాలతో, కౌన్సిలింగ్‌లతో మార్చేస్తామంటూ మానసిక వికాసాన్ని ఒక వ్యాపార వస్తువుగా మార్చేశారు. ఫలితంగా తల్లిదండ్రుల్లో, సమాజంలో నెమ్మదిగా ఒక దురభిప్రాయం పెరుగుతోంది. మార్కులు తగ్గినా, పిల్లలు కాస్త డల్‌గా కనిపించినా, కారణాలు తెలుసుకోకుండానే సైకాలజీ కౌన్సిలర్ల మీద ఆధారపడడం పెరుగుతోంది. ఇది ఖచ్చితంగా సమాజానికి మంచిది కాదు.
'ఆకాశం నీ హద్దురా!' అనే ఈ పుస్తకాన్ని మీముందుకు తేవడానికి కారణం పైన పేర్కొన్న భయాలే. విద్యార్థులు, ఉద్యోగ ప్రయత్నాల్లో వున్నవారికి ... వయసు, అర్హతలతో సంబంధం లేకుండా, అందరికీ, వారి అవసరాల మేరకు ప్రాక్టికల్‌గా ఉపయోగపడేలా ఈ కంటెంట్‌ని తీర్చిదిద్దాం.
- విఎమ్ఆర్జి ఇంటర్నేషనల్

- ₹108
- ₹324
- ₹60
- ₹214.8
- ₹72
- ₹72