-
-
అకాల వసంతం
Akala Vasantam
Author: Radhika Nori
Publisher: Vanguri Foundation of America
Pages: 287Language: Telugu
సమస్యను ఎన్నుకోవడంలో వైశిష్ట్యం
దానిని కథగా రూపొందించడంలో చాతుర్యం
శిల్పంలో వైవిధ్యం
అక్షరాల వెంట పరుగులు పెట్టించే కథ నడిపే తీరు. నోరి రాధిక కథలంటేనే ఒక ప్రత్యేకమైన ముద్ర. ఆ పేరు చూడగానే ఈమె రాసే కథ చదివి తీరాలనే ఆసక్తి పాఠకులలో కలిగించిన ఉత్తమ కథా రచయిత్రి. ఎన్నో ఏళ్ళుగా అమెరికాలో ఉంటూ తన సృజనాశక్తిని వెలారుస్తూ అటు అమెరికా జీవితంలో తాను చూసిన అనేక సంఘటనలను విశ్లేషణాత్మకంగా అందించడమే కాక మనదేశంలోని పద్ధతులు, కట్టుబాట్లు క్షుణ్ణంగా తెలిసినవారు కనక ఈ అన్నిరకాల కోణాలను రాధిక తన కథల్లో ఆవిష్కరించారు.
గొప్ప మనోవిశ్లేషణ, వ్యక్తిత్వవికాస నిపుణురాలిగా ఆవిడ ప్రతి కథలోను దర్శనమిస్తారు.
వైవిధ్యమైన అంశాలను ఎన్నుకొని ఒక్కొక్క కథను ఒక ఆణిముత్యంగా మలచిన సృజనశీలి, ప్రతిభాసంపన్నురాలు నోరి రాధిక. ఎన్ని జీవితాలను తన ఆలోచనా దృక్పథంలో మనోయవనికపై ఆవిష్కరించుకుని శిల్పంలా కథను మలిచారో, ముఖ్యంగా మనదేశంనుంచి అమెరికా వెళ్ళిన తరవాత వారి పిల్లలు అక్కడ పుట్టి పెరిగి ఆ వాతావరణానికి అలవాటు పడిన నేపథ్యం, చదువు వరకు కొంతకాలం సాఫీగా సాగిన యువతీ యువకులకు వివాహం చేసే సందర్భంలో పడిన ఇబ్బందులను, సమస్యలను, కష్టనష్టాలను వర్ణించారు రచయిత్రి. రచించిన ప్రతి కథలోను విశేషం ఉంది. ఒక సందేశం ఉంది, తీసుకున్న సమస్యలో విశ్లేషణ ఉంది.
- డా. తెన్నేటి సుధాదేవి
