-
-
అజేయుడు - నవల
Ajeyudu Navala
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 256Language: Telugu
జయప్రకాష్ ఆ ఉదయం నుండి వడివేలు ఇంట్లోనే ఉన్నాడు. మిగతా పనివాళ్ళకు వడివేలు, జయప్రకాష్ తన మేనల్లుడు సెంథిల్ అని పరిచయం చేసాడు.
సెంథిల్ మద్రాసులొ హోటల్ థౌజండ్‌లైట్స్‌లో సర్వర్‌గా పనిచేస్తున్నాడని చెప్పాడు.
తన ఐడెంటినీ ఏ మాత్రం కన్పించకుండా మారువేషం వేశాడు జయప్రకాష్.
ఫ్రెంచ్ కట్ మిసం, చెవి దగ్గర పులిపురికాయ, దట్టమైన కనుబొమలు, పూర్తిగా తమిళియన్ గెటప్‌లో వున్న జయప్రకాష్‌ను ఇప్పుడెవరూ గుర్తించలేరు.
సాయంకాలం నుంచే సర్వర్‌గా పనిచేయడం ప్రారంభిచాడు. పోలీసులకు, కాపలావాళ్ళకు, గూండాలకు కాఫీ, టీ సప్లయి చేస్తూ, అందర్నీ గమనించసాగాడు.
నిబ్బరంగా సోఫాలో కూర్చున్న ఫణిచౌదరి పరిస్థితి అతనికి అర్థం కాలేదు.
ఫణిచౌదరి ఎంత నిబ్బరంగా వున్నాడంటే, ఆ రాత్రి జయప్రకాష్ ఏమీ చేయలేడు, ఓడిపోతాడు అన్నంత నిబ్బరంగా వున్నాడు.
ఏదో జరుగుతోంది... అదేదో అతనికి అర్థం కావడం లేదు. అప్పటివరకు అతనికి దినేష్‌బాబు గదిలోకి వెళ్ళే అవకాశం రాలేదు.
Why is this not available for rent? When are you making available to rent and read?