-
-
అగ్నికార్యము - ఔపాసన
Agnikaryamu Aupasana
Author: Bhaskarabhotla Janardhana Sharma
Publisher: Sri Samayajna Samajika Sabha Trust
Pages: 66Language: Telugu
సనాతన ధర్మములో మానవుల అభివృద్ధికి, శ్రేయస్సుకు, ఉన్నతికి, అభీష్టసిద్ధికి అనేక మార్గములు తెలుపబడి ఉన్నాయి. అగ్నిదేవుడిని ఆరాధించడం అందులో ఒకటి. ఈ అగ్న్యారాధన పలు విధములు. మానవుడు పుట్టకముందు నుండే మొదలై, మరణించిన తర్వాత కూడా కొనసాగేది అగ్ని ఆరాధన ఒక్కటే. బ్రహ్మచారులైతేనేమి, గృహస్థులైతేనేమి, ఆడవారైతేనేమి, అనాది నుంచి అగ్నిని ఆరాధించుట యనునది మన సంస్కృతితో ముడిపడి ఉంది. ఈ అగ్ని ఆరాధనకు రకరకాల పేర్లు ఉన్నాయి. హోమములు, యజ్ఞములు, యాగములు అగ్ని ఆరాధనతో కూడుకున్నవే. అయితే అవన్నీ కామ్యములు. అనగా, ఒక శుభమునో, కోరికనో పొందుటకు చేసేవి. అట్లు కాక, నిరంతరమూ, జీవన పర్యంతమూ మన అభ్యుదయం కోసము, మన కోరికలతోను, ఇచ్ఛలతోనూ నిమిత్తం లేకుండా, మన ధర్మంగా భావించి చేసేవి కొన్ని ఉన్నాయి. వాటిలో బ్రహ్మచారులు చేసే 'అగ్నికార్యము', గృహస్థులు చేసే 'ఔపాసన' ముఖ్యమైనవి. ఈ రెండింటి గురించీ విపులంగా ఈ పుస్తకంలో చర్చించబడినది.
- సమయజ్ఞ సామాజిక సభా ట్రస్ట్
