-
-
అగ్గిపెట్టెలో ఆరుగజాలు
Aggipettelo Arugajalu
Author: Dr.Mantha Bhanumathi
Publisher: Mantha Prachuranalu
Pages: 200Language: Telugu
ప్రతి రచయితా తాను సృజించిన రచనల్లో కొన్నింటిని ప్రత్యేకంగా పదే పదే ప్రస్తావిచడం చూస్తుంటాం. ఎంచుకున్న కథావస్తువు, అది అక్షరాల్లో పెట్టడానికి పడిన తపన, చేసిన కృషి, ఆ నవలలోని పాత్రలతో మమేకం అయిపోవడం కారణాలు అయుండవచ్చు. అటువంటిదే ఈ నవల... “అగ్గిపెట్టెలో ఆరుగజాలు”.
మానవుల మానరక్షణకై ఉపయోగించే వలువల సృష్టి ఎలా జరిగింది? ఏ విధంగా శాఖోపశాఖలుగా విస్తరించింది? వస్త్రాల తయారీలో ఎదుర్కొనే కష్టనష్టాలు భరించేవారు ఏ విధమైన జీవనవిధానంలో ఉన్నారు? వారి కులాల శాఖలు ఏ విధంగా ఏర్పడ్డాయి? అట్టడుగు కార్మిక వర్గానికి చెందిన కుటుంబాలలో స్త్రీల పాత్ర ఏమిటి? వారు ఉన్నత విద్య అభ్యసిస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? వీవర్లలో మాస్టర్ వీవర్ల పాత్ర ఏమిటి? మాస్టర్ వీవర్లు మగ్గాల మీదున్నవారిని సరిగ్గా చూసుకోరన్న మాట నిజమేనా? పై ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుతుంటే ఒక నవలకి సరిపోయే కథావస్తువు లభ్యమయింది. అదే ఈ అగ్గిపెట్టెలో ఆరుగజాలు.
Thank you Kinige. Very well presented.