-
-
అద్యతన దృష్టి
Adyatana Drushti
Author: Mudiganti Sujata Reddy
Publisher: Roahanam Prachuranalu
Pages: 216Language: Telugu
డా॥ ముదిగంటి సుజాతారెడ్డిగారికి కేవలం సంస్కృతాంధ్రాలలో పాండిత్యమొకటే కాదు, హిందీ ఆంగ్లం జర్మనీ భాషా సాహిత్యాదులతోనూ- దేశాలతోకూడా- ప్రగాఢమైన పరిచయం వీరికి ఉంది. దీనివల్ల- సహజమైన వీరి అధ్యయనశీలానికి విస్తృతి అనేది ఇబ్బడి ముబ్బడిగా పరిఢవిల్లింది. కావ్యాలతో ప్రారంభించి యాత్రాకథనాలవరకు సమస్త ప్రక్రియలనూ సాహితీశాఖలనూ ఆపోశన పట్టింది. వాటిలో తనకున్న సృజనశక్తినీ చాటి చెప్పింది. చరిత్ర రాజకీయార్థిక సామాజిక శాస్త్రాలనూ స్పృశించింది. అధ్యయనంలోని ఈ తరహా విస్తృతివల్ల- సహిష్ణుత, నిష్పాక్షికత, విచక్షణత అనే గుణత్రయం సిద్ధిస్తుంది. అప్పుడు- సప్తద్వీపాలకూ విస్తరించిన సాహితీసింధువు కాస్తా వచ్చి వచ్చి అరచేతిలో అమృతబిందువు అయిపోతుంది. సాహితీ భూగోళం ఒక సాహితీ కుటీరం అయిపోతుంది. అవగాహన పరిధి- వ్యాకోచిస్తే, అవగాహ్య విస్తృతి- ఘనీభవిస్తుంది. రత్నమవుతుంది. ఇదొక అవగాహనపరమైన ప్రపంచీకరణ. బహుశః సుజాతారెడ్డిగారు దీనినే అద్యతన దృష్టి అన్నారనుకుంటాను.
ఇది పాఠకులకు అన్నివిధాలా లాభసాటి వ్యాససంపుటి. పూర్తిగా గిట్టుబాటు అవుతుంది. స్వానుభవంతో ఇస్తున్న భరోసా సుజాతారెడ్డిగారికి ధన్యవాదాలు చెబుతూ, ఆబోరు దక్కించుకున్నానని సంబరపడుతూ సెలవు.
- బేతవోలు రామబ్రహ్మం
