-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఆధ్యాత్మిక జీవనం (free)
Adhyatmika Jeevanam - free
Author: K.R.Paramahamsa
Publisher: Mohan Publications
Pages: 240Language: Telugu
యుగయుగాలుగా జ్ఞానమార్గంలో పయనించే అన్వేషకుడు ఆ మార్గంలో అతడిని నడిపించే గురువు, ధ్యానమార్గంలోనూ, దీక్షామార్గంలోనూ ప్రాముఖ్యం వహించారు. అన్ని మార్గాలలోను ఆధ్యాత్మిక గురువు యొక్క ఆవశ్యకతను నొక్కి వక్కాణించడం జరిగింది. అన్వేషకుడు ఆధ్యాత్మిక మార్గంలో ఏ స్థాయిలో ఉన్నాడో అతడికి రాబోయే విపత్తులు అడ్డంకులేవో చెప్పగలిగిన శక్తి కలవాడు గురువు.
ఆధ్యాత్మిక మార్గంలో అనేక సంప్రదాయాలున్నాయి. ఏ సంప్రదాయం ప్రత్యేకత దానిదే. తాను ఏ సంప్రదాయానికి చెందినవాడో ఆ సంప్రదాయంలో భోధన, రీతి రివాజులు గురువుకి పూర్తిగా అవగాహన ఉండడం జరుగుతుంది. ఈ సంప్రదాయాలలో కొన్ని లిఖితపూర్వక శాస్త్రాలు, కొన్ని మౌఖిక సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక గురువు నుండి తన శిష్యుడికి, ఆ శిష్యుడు గురువుగా పరిణమించినపుడు అతడి శిష్యుడికి ఆధ్యాత్మిక సంపద ఒక పరంపరగా కొనసాగుతుంది. ఈ గురుశిష్య పరంపర పద్ధతి అన్ని సాంప్రదాయాలలోనూ ఉన్నది.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE