-
-
ఆధునిక భారతదేశ చరిత్ర
Adhunika Bharatadesa Charitra
Author: Bipin Chandra
Pages: 392Language: Telugu
ఈ పుస్తకం బ్రిటీష్ ఇండియాగా చెప్పబడే కాలానికి సంబంధించిన స్థూల చిత్రాన్ని అందిస్తుంది. భారతదేశంలో జాతీయవాదం, వలసవాదాలపై నా స్వీయ పరిశోధనలు, ఈ రంగంపై వెలువడిన అనేక విజ్ఞానదాయకమైన గ్రంథాలు కూడా ఇందుకు ఆధారంగా తీసుకున్నాను. పాత సామ్రాజ్యవాద జాతీయవాద చరిత్ర కథనాలను సవాలు చేయడం, పునరుల్లేఖించడంతో పాటు ఈ పుస్తకం చరిత్ర రాజకీయ కథన శైలికి పరిమితం కాకుండా వివిధ పార్శ్వాల మధ్య అంతస్సంబంధాన్ని నొక్కి చెబుతుంది.
* * *
ప్రసిద్ధ చరిత్రకారుడు బిపన్చంద్ర ఆధునిక భారతదేశ చరిత్రపై రాసిన ప్రామాణిక గ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందించేందుకు సంతోషిస్తున్నాం. లోగడ భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రతో సహా ఆయన ఇతర చరిత్రకారులు రచించిన అనేక విలువైన పుస్తకాలను తెలుగులో తీసుకొచ్చిన సంగతి మీకు తెలుసు. ప్రస్తుత పుస్తకం సంక్షిప్త పాఠం గతంలో మరో ప్రచురణగా వెలువడినప్పటికీ ఇది ఆయనే సవరించి విస్తరించిన సమగ్ర రూపంలో తెలుగులో రావడం ఇదే ప్రథమం. 2009లో తొలిసారి ముద్రితమైన ఈ పుస్తకం స్వల్పకాలంలోనే ఇంగ్లీషులో మూడు ముద్రణలు పొందడం దాని ప్రాధాన్యతకు ఒక ఉదాహరణ మాత్రమే.
- ప్రచురణ కర్తలు
I'm unable to download file. Only url is downloading.what to do?