• Adhipatyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆధిపత్యం

    Adhipatyam

    Pages: 108
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆత్మీయ మిత్రులు, శతాధిక కథారచయిత డా॥ మంతెన సూర్య నారాయణరాజు కథల నాస్వాదిస్తూంటే ఆనందనందన వనములో విహరిస్తున్నట్టు ఉంటుంది. విలక్షణమైన శైలిలో ఎత్తుగడ, కథోపకథనము, ముగింపు అలరిస్తుంటాయి. మళ్ళీ చదవమంటాయి. అగ్రశ్రేణి పత్రికలు వారి కథలకు అగ్రతాంబూలం ఇచ్చాయి. రాశిలోనే కాదు వాసిలో కూడా సొంతముద్ర వేసుకున్న వారి కథలు కొన్ని 'ఆధిపత్యం' సంపుటిగా వెలువడటం కథాప్రియులకు కమ్మని విందు.

- ఐతా చంద్రయ్య

* * *

సూర్యనారాయణరాజు తమ కథల్లో సమాజంలోంచి ఏ సమస్యను తీసుకున్నా ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళి మూలాలను పట్టుకుని ఆ నేపథ్యంలోంచి జీవితాన్ని దర్శిస్తారు. తీసుకున్న ఇతివృత్తానికి సందర్భోచితంగా సన్నివేశ చిత్రణ ఉంటుంది. మానవ సంబంధాలనూ, దాంపత్య ప్రేమ సంబంధాలనూ, స్నేహసంబంధాలనూ అతి నేర్పుగా పాఠకుల కళ్ళముందు ఆవిష్కరింపజేయడం ఈయన ప్రత్యేకత. మానవ స్వభావ పరీశీలనే కాకుండా మానవీయత కూడా ఈ రచయిత కథల్లో మనకు స్పష్టంగా గోచరిస్తుంది. హంగూ ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా చెప్పటం వల్ల ఈయన కథలు పాఠకులను సమ్మోహపరుస్తాయి.

- చోడిశెట్టి శ్రీనివాసరావు

Preview download free pdf of this Telugu book is available at Adhipatyam