-
-
అధిక రక్తపోటు
Adhika Rakthapotu
Author: Dr. Patibandla Dakshinamurthy
Publisher: Amaravathi Publications
Language: Telugu
నేడు ప్రపంచం ఎదుర్కుంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనది 'హై బీ.పీ.' దీనినే 'సైలంట్ కిల్లర్' అంటే నిశ్శబ్దంగా కబళించే వ్యాధి అని అనుకోవచ్చు. ఎందుకంటే 'హై బీ.పీ.' వచ్చిన చాలాకాలం పైకీమీ తెలియదు. కానీ లోపల జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతుంటుంది. అంతే కాక అధిక రక్తపోటు కారణంగా తలెత్తే దుష్ప్రభావాలు వెంటనే బయటపడేవి కావు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించడం, చికిత్స చేయడం చాలా అవసరం. నిర్లక్ష్యం చేసే కొద్దీ అది గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్ర సమస్యలకు దారితీసి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతుంది. అధిక రక్తపోటుని గురించిన అవగాహన లోపించడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. రక్తపోటును సరిగ్గా నియంత్రణలో పెట్టుకోకపోతే మెదడు నుంచి కాళ్ళవరకు ఎన్నో ప్రమాదకరమైన సమస్యలు చుట్టుముడతాయి.
ప్రముఖ వైద్య నిపుణులైన డాక్టర్ పి. దక్షిణామూర్తిగారు సులభశైలిలో రాసిన ఈ పుస్తకం చదవడం ద్వారా అధిక రక్తపోటు ఉన్నవారు వ్యాధి పట్ల అవగాహన పెంచుకోడమే గాక అధిక రక్తపోటును ఏయే జాగ్రత్తలు పాటించి అదుపులో వుంచుకోవచ్చో, కాంప్లికేషన్ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని ఎలా కాపడుకోవచ్చో తెలుసుకోగలరు.
ప్రతీ ఒక్కరూ తప్పక కొని చదవవలసిన పుస్తకం!
- ప్రచురణకర్తలు
