-
-
అద్దె ఇంట్లో కొత్తబ్బాయ్
Adde Intlo Kotthabbay
Author: N S Nagireddy
Pages: 236Language: Telugu
సాయంకాలం సరిగ్గా నాలుగవుతుండగా రెండు సూట్కేసులతోపాటు ఆ మండువా లోగిలిలో లాండ్ అయిపోయాడు రంజన్.
అద్దె యింట్లోకివచ్చిన కొత్తబ్బాయ్ని చూడటానికి మిగిలిన వాటాల్లోని వాళ్ళంతా మండువాలో గుమిగూడరు.
ఆదివారం కావడంతో మగాళ్ళంతా కూడ యింటి పట్టునే ఉన్నారు. ఆడవాళ్ళతోపాటు కొత్తబ్బాయిని రిసీవ్ చేసుకోవడనికి వాళ్ళూ వచ్చారు.
సదానందం కొత్తబ్బాయిని అందరికీ పరిచయం చేశాడు. అమ్మాయిలా నాజూకుగావున్న రంజన్ని హేపీగా ఆహ్వానించారంతా.
దినేష్ సాలెగూడులో యిరుక్కున్న రంజన్కేసి జాలిగా చూస్తూ ''గ్లాడ్ టు మీట్ యూ!'' అంటూ చేయి ముందుకు చాపాడు.
రంజన్ తటపటాయిస్తూనే చేయి అందించాడు. చాలా స్మూత్‌గా ఉన్న రంజన్ చేయిని స్పర్శించి వదిలేస్తూ చెప్పాడు దినేష్.
''నా పేరు దినేష్! నాలుగు రోజులనుంచి ఈ వాటాలో ఉంటున్న వ్యక్తిని. ఈ రోజు నుంచి మన యిద్దరం కల్సి జాయింట్‌గా బాధలుపడాల్సి వుంది.''
''మీరేం వర్రీ అవకండి. ఎలాంటి బాధలనయినా సాల్వ్ చేయగల శక్తి నాకుంది.'' అన్నాడు రంజన్ నవ్వుతూ.
''అయ్యో. నీకెలా చెప్పాలో నాకు తెలియడంలేదు. ఇంట్లో అడుగుపెట్టకముందే చెప్పడం బాగుండదని.''
''ష్. అధిక ప్రసంగం.'' కళ్ళు పెద్దవిచేశాడు సదానందం.
దినేష్ చిన్నగా నవ్వాడు. ''తినబోతుండగా రుచి గురించి చెప్పడం దేనికిలే.''
చాలా చెత్తగా వుంది. చీప్ క్వాలిటి నవల.