• Addam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అద్దం

    Addam

    Author:

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాహిత్య ప్రక్రియలో కథకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కథ జీవితాలలోంచి పుట్టుకొస్తుంది. ప్రతి కథా రచయిత జీవితానుభవం నుండే కథలు అల్లుతాడు. ఏ ఇద్దరి జీవితానుభవాలు ఒకటే ఉండవు. విభిన్న పార్శాలు కలది జీవితం. అందువల్ల సహజంగానే కథా వస్తువులలో చాలా వైవిధ్యం కనబడుతూ ఉంటుంది. తన చుట్టూ ఉండే, తను ఎరుగని జీవితమే కథావస్తువు. కనుక, ఏది మంచి కథ అని అంచనా వేసినప్పుడు, కథావస్తువు తాలూకు ప్రాధాన్యం పరిమితమే. కథావస్తువు ఎంత గొప్పదైనా ఎంత విజ్ఞానదాయకమైనదైనా, ఎంతో గొప్పగా, జీవిత చిత్రీకరణ చేసేదైనా, చదివించేదిగా ఉండాలి. ఆసక్తి దాయకంగా సాగాలి అనేది, మంచి కథకి ఉండవలసిన ముఖ్యలక్షణమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చదవగలిగితే, కథ -కథలోని విషయాలు అర్థం అవుతాయి.

''కస్తూరి అలివేణి''గారి కథలు చదివించే కథలు. మామూలు మధ్యతరగతి జీవిత వాస్తవికతలకు అద్దం పట్టే కథలు. కస్తూరి అలివేణిగారి కథల్లోని సన్నివేశాలు, సంఘటనలు నిత్య జీవితంలోవే, కథా పాత్రలు మన చుట్టూ తిరిగే వాళ్ళే. మాటలు మన మాటలే. రచనలో అనుభూతి, ఐక్యత ఉంది. ఈ రచయిత్రి మంచి కథలు వ్రాయగలదు. అలివేణిగారు ఇతివృత్తి విస్తృతిని పెంచుకొని మరెన్నో మంచి కథలు వ్రాసి తెలుగు సాహిత్య కథావీధిలో, ఒక దీపంగా వెలుగుతారని ఆశిస్తున్నాను.

- ఎల్‌.ఆర్‌. స్వామి

Preview download free pdf of this Telugu book is available at Addam
Comment(s) ...

ఈ కథాసంకలనంపై మార్చి 2013 సుజనరంజనిలో వచ్చిన సమీక్ష ఇక్కడ చదవచ్చు.