-
-
అడ్డా
Adda
Author: Sailajamithra
Publisher: Palapitta Books
Pages: 164Language: Telugu
విభిన్న ప్రక్రియల్లో రచనలు చేస్తున్న సృజనశీలి శైలజామిత్ర. కథానికలని అందంగా తీర్చిదిద్దడంలో పరిణతి చెందిన రచయిత్రి అని ఈ సంపుటి నిరూపిస్తుంది. ఇతరులు స్పృశించని అంశాల్ని ఇతివృత్తాలుగా ఎంచుకున్నారు. ఇతివృత్తానికి తగిన శైలీశిల్పాలతో కథానికలలు విలక్షణ సౌందర్యాన్ని చేకూర్చారు. సన్నివేశాల కల్పనలో, సంభాషణల్లో సహజత్వం తొంగి చూస్తుంది. మనుషుల చిత్తప్రవృత్తులకు మూలాలు ఏమిటో చెప్పడానికి ప్రయత్నించారు. వర్తమాన సమాజంలో విభిన్నరంగాలకు సంబంధించిన మనుషుల జీవితాల్ని హృద్యంగా చిత్రించారు. ఈ కథానికల్లోని పాత్రలు సజీవంగా కళ్ళముందు కదలాడుతున్నట్లుగా తోస్తుంది. పాత్రల చిత్రణలో అంతటి ప్రతిభ చూపడమే దీనికి కారణం. ఒక్కమాటలో చెప్పాలంటే మానవీయ విలువల్ని పెంపొందించడానికి తోడ్పడే కథానికలివి. చెడును హరించడానికి, మంచిని పెంచడానికి ఉపకరిస్తుంది శైలజామిత్ర కథాసాహిత్యం. అందుకోసమే ఈ కథానికల్ని చదవాలి. పదుగురితో చదివించాలి.
