-
-
అద్భుత మెమరీ - తిరుగులేని విక్టరీ
Adbhuta Memory Tiruguleni Victory
Author: Dr.Rajasekhar
Publisher: S.R. Book Links
Pages: 112Language: Telugu
మానవుడు ఆదిమానవుడిగా ఉన్న కాలం నుంచి ఈనాటి దాకా చాలా రకాల అభివృద్ధిని సాధించాడు. వీటన్నిటి వెనుక తాను ఎల్లప్పుడూ తనలో ఉన్న ఒకానొక గొప్ప శక్తిని పెంపొందించుకుని సాధించాడు. అదే జ్ఞాపకశక్తి
ఆదిమానవుడు మొదట్లో తన గుహనుంచి వేటకై బయలుదేరి వెళ్ళి తిరిగి సాయంత్రం గుహకి క్షేమంగా సరిగా చేరుకోవటానికి ఈ శక్తినే ఉపయోగించేవాడు.
ఈనాటి మానవుడు తన పూర్వీకులు కనిపెట్టిన ఎన్నో శాస్త్ర సంబంధమైన, విజ్ఞానపరమైన విషయాల్ని జ్ఞాపకశక్తి ద్వారానే తన అభివృద్ధికై వినియోగించగలుగుతున్నాడు.
అసలు జ్ఞాపకశక్తి లేకపొతే మానవుడు అసలేమీ చేయలేని స్థితికి చేరుకుని ఉండేవాడు. ఈ జ్ఞాపకశక్తి అనేది మిగిలిన జంతువులలో ఒక ఆహార విషయాల్లోను లేదా ప్రాణరక్షణ విషయంలో మాత్రమే ఉపయోగపడుతుంది. కాని అది సహజ లక్షణంగానే ఏర్పడుతుంది.
మానవుడు ఒక్కడే ఈ అద్భుతశక్తిని పరిపూర్ణంగా ఉపయోగించ గలదు.
అయితే ఇదంతా ఒకప్పటి మానవుడి స్థితి.
ఇప్పటి పోటీ ప్రపంచంలో విజ్ఞానం అనేది క్షణక్షణానికి పెరుగుతోంది. దీనిని ఎప్పటికప్పుడు గ్రహించలేని వ్యక్తి అభివృద్ధిని సాధించలేడు.
కొన్ని సంవత్సరాల క్రితం వరకూ అంటే పోయిన తరం వరకూ విద్యార్థులకు ఉన్న సబ్జెక్టులు, వాటి పరిమాణం, ఈ తరం విషయానికి వచ్చేసరికి కొన్ని వందల రెట్లు పెరిగింది అనేది నిర్వివాదాంశం.
కాని విద్యారులలో ఆ పరిమాణంలో లేదా అంతటి శక్తి సామర్థ్యాలు కాని, వాని గ్రహణశక్తి గాని పెరిగిందా ?
రోజురోజుకి సిలబస్ కొండలా పెరిగిపోతూనే ఉంది. కానీ విద్యార్థి సామర్థ్యం పెంచే విషయంలో టీచర్లు కాని, విద్యార్థులు కాని, వారి తల్లిదండ్రులు కాని దృష్టి సారించకపోవడం శోచనీయం.
తద్వారా విద్యార్థిపై ఒత్తిడి పెరిగి, ఫలితాలు ఆశించిన రీతిలో లేకపోవడం, అది తిరిగి విద్యార్థిని నిరాశా నిస్పృహలకు గురిచేయడం జరుగుతుంది.
అందులో సున్నిత మనస్కులు కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం లాంటి దారుణాలకు దారితీస్తున్నాయి.
వీటన్నింటికి వెనుక ఒకే ఒక కారణం ఉంది. అది మనిషికి సహజసిద్ధంగా లభించిన జ్ఞాపకశక్తి అనే దీపాన్ని మనిషి ఎక్కడో పోగొట్టుకున్నాడు. తద్వారా తన జీవితాన్ని తానే చీకటి చేసుకున్నాడు.
ఆ ఆరిపోయిన దీపాన్ని వెలిగించి తద్వారా మనిషి తన జన్మహక్కు అయిన అభివృద్ధిని సాధించేలా చేసే ప్రయత్నమే ఈ పుస్తకం.
- పబ్లిషర్స్

- ₹78
- ₹243.6
- ₹174.96
- ₹480
- ₹495.6
- ₹135.6