-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
అడవి పక్షి ఆలాపన (free)
Adavi Pakshi Alapana - free
Author: Dr. G. Venkata Lal
Publisher: Self Published on Kinige
Pages: 78Language: Telugu
సామాజిక సంవేదనలను వ్యక్తీకరించి కవిత్వం రాయటం ఆధునిక కవిత్వంలో చెప్పుకోదగ్గ పరిణామం. కొత్తగా రచనలు చేసేవారు కవిత ప్రక్రియనే ఎన్నుకొని తమ రచనా ప్రయాణాన్ని మొదలు పెడతారు. తెలుగు కవిత్వానికి ఇది ఒక కొత్త గొంతుక. ఆదివాసీల్లో గూడు కట్టుకున్న ఆవేదనను, ఆక్రందనను, ఆర్తిగా అచ్చమైన అడవిపక్షిలా ఆలపించారు. ఈ ఆలాపనలో కవి ఎంతో హృద్యంగా తన బాధను జనారణ్యానికి నివేదించాడు.
ఇందులోని కవితలను కేవలం కవి ఎంచుకున్న ఘటనల నేపధ్యం నుండి మాత్రమే చూస్తే సరిపోదు. కవి మానసికావస్థలోని ఏ ఘర్షణాపూరితమైన సమాజ బతుకుల్లోంచి వినబడతాడు. కవి హృదయాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను ఆయన కవితలను అంచనా వేయగలనని అనుకుంటున్నాను.
అడవి నుండి బయటకొచ్చినా ఆధునికత అల్లికైన ‘బతక నేర్పరితనం' అతనికి ఏకించెత్తు కూడా లేదు. ఆధునిక సమాజంలో లేకపోతే బతకటం కష్టమే. ఆ ‘బతకలేని తనమే' తన మూలాలను వెతుక్కుంది. ఆ వెతుకులాటే కవిగా మనముందు నిలబడటానికి నిలువెత్తు కారణమైంది. ప్రశ్నించే తత్వాన్ని, ధిక్కారాన్ని కవితా వస్తువుగా చేసుకొని మన ముందుకొస్తున్నాడు.
“అడవి పక్షి ఆలాపన” చూస్తే ఆధిపత్య, దోపిడి కులాల రాజకీయాలకు ఆదివాసీలు బలి అవుతున్నారని మా బతుకులు మాకు బతకనివ్వండి అంటాడు. అణిచివేతలకు గురవుతున్న అందరి పక్షాన కవిత్వం నిలబడాలని కోరుకుంటాడు. పీడిత ప్రజల పక్షం అక్షరాలు గోదారిలా వెల్లువెత్తాలని అంటాడు. దళిత, గిరిజన, స్త్రీ పక్షాన నిలబడాలంటాడు. శిల్పం విషయానికొస్తే కవి తను ఎంచుకున్న వస్తువు ద్వారా సూటిగా విషయాన్ని చెప్పటానికి ఆసక్తి చూపాడు. కవి తన నిరసనను వ్యక్తీకరించటానికి వ్యంగ్యాత్మకంగా, చమత్కారంగా నినాదాల పరంపరలతో ఉపమా, రూపకాలతో భావాల్ని అభివ్యక్తీకరించాడు. దాదాపు కవితలన్నీ తాను ఉద్దేశించిన పాఠకులకు చేరువయ్యే శైలిలో వెలువరించాడు. కనుక ఈ అడవిపక్షి ఆలాపన తప్పకుండా పాఠకులకు చేరువవుతుందని ఆశిస్తున్నాను.
- పొనుగోటి రవికుమార్
