-
-
అడవిగాచిన వెన్నెల (చైనా వనితల వెతలు)
Adavi Gaachina Vennela
Author: Komala Venigalla
Publisher: Rationalist Voice Publications
Pages: 654Language: Telugu
అడవిగాచిన వెన్నెల చైనా సమకాలీన సమాజానికి, కుటుంబ వ్యవస్థకు, సంక్షోభానికి దర్పణం. రచయిత్రి యుంగ్ చాంగ్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో వుంటూ రాసిన ‘ Wild Swans ‘ ప్రపంచాన్ని ఆకట్టుకున్నది. చైనా నియంత మావోతో పనిచేసిన యంగ్ చాంగ్ కుటుంబం బయట ప్రపంచానికి అక్కడి తెరవెనుక వాస్తవ స్థితిని, నిజాలను బయటపెట్టింది. అందుకే ఈ పుస్తకాన్ని చైనాలో నిషేధించారు. అయితే రచయిత్రిని రానిచ్చారు! చైనా గురించి అసలు చరిత్ర మనకు రాలేదు . కమ్మూనిస్టుల పార్టీ ప్రచార రచనల ప్రభావంలో ఇన్నాళ్ళూ కొట్టుకపోయిన ధోరణికి రచయిత్రి అడ్డుకట్ట వేసి, అందరికీ అందుబాటులో వుండేటట్లు వివరణ చేసింది.
38 అధ్యాయాలతో వున్న ఈ రచనలో ప్రత్యేక ఆకర్షణగా, రచయిత్రి, చైనాలో తన కుటుంబం, చైనా పాలకుల చిత్రాలు అందించారు. చైనా గ్రేట్ వాల్ వెనుకవున్న అమాయకత్వం, పేదరికం, జైళ్ళలో క్రూరత్వం వివరంగా చదవనగును. 1978నుండీ యుంగ్ చాంగ్ భర్త హాలిడేతో ఇంగ్లాండ్‌లో ఉంటూ, రచనలు కొన సాగిస్తున్నారు. అడవిగాచిన వెన్నెల గమనిస్తే నవల, జీవిత చరిత్ర, దేశ గమనం, రాజకీయ చదరంగం, ఏర్చి కూర్చి సానబట్టినట్లు కనబడుతుంది.రచయిత్రి అమ్మమ్మ, తల్లి అనుభవాలను చరిత్రలో ఇమిడ్చి రాసిన తీరు ఆశ్చర్యం గొలుపుతుంది. మావో ప్రారంబించిన సాంస్కృతిక విప్లవంలో చేరి, దానికి ఆహుతి అయిన తీరు గొప్పగా చెప్పారు.
బయట ప్రపంచం చూసిన తరువాత గాని అంత కాలం బావిలో కప్పలవలె ఎలా వున్నామో అనేది రచయిత్రికి తెలిసి మనకు విడమరచి చెప్పింది. భారత దేశానికి చైనాకు గల సంబంధం వలన కూడా ఈ రచనకు విశిష్టత సమకూడింది. దీనిపై రంగనాయకమ్మ విపులమైన నిశిత సమీక్ష ఆంధ్రప్రభలో రాసి, పుస్తకంగా ప్రచురించారు. అమెరికా, యూరోప్‌లు ఈ రచనను ఆదరిస్తే, తెలుగు పాఠకులు ఇంచుమించు అంతే స్వాగతం పలికారు.
రచయిత్రి యుంగ్ చాంగ్ 1952 లో చైనా దేశపు సిచూఅన్ ప్రోవిన్స్ లోని ఇబిన్లో జన్మించారు. తన 14 వ ఏట కొద్దికాలం రెడ్ గార్డ్‌గా ఉన్నారు. చైనాలో వివిధ వృత్తులలో పనిచేసి, యు.కె. వెళ్లి లింగ్విస్టిక్స్‌లో పిహెచ్.డి. చేసి, లండన్ యునివర్సిటీలో ఒరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ డిపార్ట్మెంట్లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
