-
-
అడవి
Adavi
Author: P. Chandra Sekhara Azad
Pages: 42Language: Telugu
హెడ్డు ముఖంలో రంగులు మారిపోయాయి. అయినా తమాయించుకున్నాడు.
"ఓపని చెయ్యి. ఇదిగో కాగితం. రాజీనామా చేసి ఇటునుండి ఇటే వెళ్ళిపో" అన్నాడు తెల్లకాగితం జేబు నుంచి తీసిస్తూ. అతను వెర్రి చూపులు చూశాడు.
"మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు" అన్నాడు.
"అన్యాయమా, ఎవడిది అన్యాయం కాదయ్యా. మనకి ఎవడు అడ్డుంటే వాడిని తొలగించడమే న్యాయం. పోలీసులు దొంగల్నీ, నక్సలైట్లనీ కాలుస్తారు. నక్సలైట్లు పోలీసుల్నీ రాజకీయనాయకుల్ని ఇంకా వారి దృష్టిలో దుర్మార్గులని చంపుతారు. ఏదీ ఆగదు, ఏదీ అన్యాయం కాదు" అన్నాడు.
"సార్ ఇది అడవా? మనుషులెండేదా?"
"అడవే. మనుషులుండే అడవి. అందుకే నీలాంటి వాడికి ఇక్కడ చోటులేదు. నా మాటిను. ఇంతటితో అయిపోలేదు. రేపు ఇంకో కోటిగాడు తయారవుతాడు. ఆడ్నీ లేపేసెయ్యమంటారు. నేను యుద్ధం చేయను అని అర్జునుడిలా అంటానికి పోలీసులకి కుదర్దు. ఉద్యోగంలో చేరిన్నాడే చంపు, చావు. ఈ రెండే సిద్ధాంతాలు."
