• Achchu
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అచ్చు

    Achchu

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆరిపోని జ్యోతి


వెలివాడ లంద వెదజల్లిన జాతి పరిమళం
రేపటి కిరణాల్ని దోసిట్లో పట్టుకొని
అంటరాని ధూళిలో కన్నీరు వదిలించడానికి
సావిత్రిభాయి తొవ్వల చేసిన
నడక సంతకం ఆమెది


అవమానాల్ని చిమ్మడానికి
అక్షర కొమ్ములకు బలుపాలు కట్టి
పసికలల పనలకు ఆత్మగౌరవం దిద్దిన
వెలుగు ముద్దెర ఆమెది


ఊపిరి ఉన్నంత వరకు
బతుకును ఓ ఒత్తిని చేసి
పసిపిల్లల పొద్దుపొడుపు జ్ఞానాన్ని
మరిగించిన దీపశిఖ ఆమె


నిన్ను కాపాడుకోలేని వ్యవస్థలో
బతుకుతున్నందుకు కన్నీళ్లయి
కలం దించి, శిరసొంచి
వీడ్కోలు పలికినా
చల్లబడిన నీ బీజాక్షరాల్లో
నిరంతరం వెలుతురు ధృవతారవు

Preview download free pdf of this Telugu book is available at Achchu