• Abraham Kovur Jeevitam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అబ్రహం కోవూర్ జీవితం

    Abraham Kovur Jeevitam

    Publisher: Vasavya Book House

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డాక్టర్ అబ్రహాం టి. కోవూర్ ఆంధ్రదేశానికి అత్యంత సన్నిహితులు. 1974 నుండీ భారతదేశం అంతటా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నలుమూలలా కోవూర్ విస్తృతంగా పర్యటించి బాబాల బండారాన్ని బయట పెట్టడం ద్వారా గొప్ప సంచలనాన్ని కలిగించి, ఆలోచింపజేశారు.

మూఢనమ్మకాలను రూపుమాపడానికి డాక్టర్ కోవూర్ జరిపిన కృషి ఎంతో గణనీయమైనది.

డాక్టర్ కోవూరకు, నాస్తిక కేంద్రానికి సన్నిహిత సంబంధం వుంది. 1970లో గోరా తన ప్రపంచ పర్యటన చివరి ఘట్టంగా శ్రీలంక రాజధాని కొలంబో వెళ్ళినప్పుడు డాక్టర్ కోవూర్ ప్రత్యేక సభ ఏర్పరిచారు. కోవూర్ ఆంధ్ర పర్యటనలో నాస్తిక కేంద్రానికి వచ్చి గోరా రచించిన “మూఢనమ్మకాలు - నాస్తికదృష్టి" పుస్తకాన్ని ఆవిష్కరించారు. శ్రీ లవణం ఆంధ్రలో కొన్ని సభలలో డాక్టర్ కోవూర్ ఉపన్యాసాలు అనువదించారు.

1975 మే లో శ్రీ లవణం, శ్రీమతి హేమలతా లవణం మూడు వారాలు శ్రీలంక పర్యటించి డాక్టర్ కోవూర్ అతిధులుగా ఉన్నప్పుడు ఆయనతో వివిధ విషయాలు చర్చించడమే కాక, రేషనలిస్టు నాయకులతో సన్నిహిత సంబంధం ఏర్పడింది.

ఈ పర్యటన తరువాత తిరిగి 1977 జనవరిలో కోవూర్ కేరళ తన జన్మస్థానమైన తిరువెళ్ళ వచ్చినప్పుడు శ్రీ లవణాన్ని అక్కడకు రమ్మని ఆహ్వానించారు. ఈ విధంగా ఆయన కుటుంబీకులతోను, మిత్రులతోను జరిపిన చర్చలు కూడా కోవూర్ విశిష్ట వ్యక్తిత్వాన్ని మరింత తెలుసుకొనుటకు అవకాశం కలిగింది.

డాక్టర్ కోవూర్‌తో జరిపిన చర్చలు, ఆయన మిత్రుల నుండి సేకరించిన విషయాల ఆధారంగా శ్రీ లవణం రచించిన “కోవూర్ జీవితం" ఎన్నో క్రొత్త విషయాలను వెలుగులోకి తెస్తోంది. మహత్మ్యాలను ఛాలెంజ్ చేయడంలో అందరికీ చిరపరిచితమైన కోవూర్ కార్యక్రమాలను క్లుప్తంగా పేర్కొని, ఆయన జీవితానికి ఈ పుస్తకంలో ప్రాధాన్యత నివ్వడం జరిగింది.

- నాస్తిక కేంద్రం

Preview download free pdf of this Telugu book is available at Abraham Kovur Jeevitam