-
-
అభివృద్ధిని ఇలా చూద్దాం
Abhivruddhini Ilaa Chooddaam
Author: Mudunuri Bharathi
Pages: 205Language: Telugu
అభివృద్ధిని ఇలా చూద్దాం
ముదునూరి భారతి
మనుషులు తమ చుట్టూ ఉండే ప్రకృతి ద్వారా, మిగిలిన మనుషుల ద్వారా ఆలోచనలకి ప్రేరణ పొందుతారు. ఈ ఆలోచనలకి మూలం ప్రకృతిలోనూ, మనుషులలోనూ ఉండే తేడాలు. ప్రకృతిలో చెట్లన్నీ ఒక్కలాగే ఉన్నా, ఒక మామిడి చెట్టుకీ ఒక జామ చెట్టుకి మధ్య ఉండే తేడా, అలాగే ఒక జామ చెట్టుకీ మరొక జామ చెట్టుకీ ఉండే తేడాలు మనిషిలో ఆలోచనలు రేకెత్తిస్తాయి. అలాగే ఒక మనిషికీ మరొక మనిషికీ రూపంలో ఉండే తేడాలు , ఆలోచనలలో తేడాలు, ప్రవర్తనలో తేడాలు - ఇవే మనిషిలోని ఆలోచనని ప్రేరేపిస్తాయి. ఈ తేడాలు ప్రకృతిలోనూ, సమాజంలోను భిన్నత్వాన్ని చూపిస్తాయి. ఈ భిన్నత్వం జ్ఞానానికి ఒక ప్రాథమికాంశం అవుతుంది. కాలగమనంలో ఒకే వస్తువులో కల తేడాలను మనిషి ఒక మార్పుగా గ్రహించడం, ఆ మార్పు ఏకకాలంలో అదే వస్తు సముదాయంలో కూడా గ్రహించడం జరుగుతుంది. ఈ భిన్నత్వం నుండి మార్పు దశకి జ్ఞానం పెరుగుతుంది. మార్పులో సహజత్వం చూసినప్పుడు, ఆ మార్పు ఆ వస్తువులో అంతర్గతంగా జరుగుతున్నప్పుడు, అది ఒక చలనంగా గ్రహించడం జరుగుతుంది. ఆ చలనం గురించి, ఈ చలనంలో ఉండే సూత్రాల గురించి చేసిన అధ్యయనాలు భౌతిక శాస్త్రానికి కాని, సామాజిక శాస్త్రాలకు కాని మూలమవుతాయి. ప్రధానంగా నేను వాస్తవ ప్రపంచాన్ని చూసి, దానిని అర్థం చేసుకునే క్రమం ఈ మూడు అంశాలు - అంటే భిన్నత, మార్పు, చలనం ద్వారా గ్రహించడమే ఈ వ్యాసాలు రావడానికి మూల కారణం.
* * *డా. ముదునూరి భారతి భౌతిక శాస్త్ర పట్టభద్రురాలు. సామాజిక అధ్యయనాలు ప్రారంభించి, సమాజంలో అభివృద్ధి పేరిట జరిగిన అనేక ఆర్థిక పరిణామాలను నిశితంగా పరిశీలించారు. సమాజ పరిణామాన్ని వాస్తవికంగా గుర్తించడానికి తగిన పరిశీలనా సంవిధానాన్ని అన్వేషించే కృషిలో ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ విస్తృతంగా రచనలు చేసారు. మార్క్సియన్ విశ్లేషణా సంవిధానం గురించి హైదరాబాదు విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ చేసారు.
