• Abhijnana Sakuntalam
  • Ebook Hide Help
    ₹ 259
    288
    10.07% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అభిజ్ఞాన శాకుంతలమ్

    Abhijnana Sakuntalam

    Publisher: S.R. Book Links

    Pages: 348
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శాకుంతలం మధుర, చతుర, హిత, మహితోక్తులకు పుట్టినిల్లు. అమృత కవితాప్రవాహం. భారతీయ జీవన విధానంలోని గొప్పదనానికి కరదీపిక. గృహస్థాశ్రమ ధర్మాలను విస్మరించ రాదని హెచ్చరించే కావ్యం. ఇందులోని ప్రధాన పాత్రలే కాదు, అతి సామాన్య పాత్రలు కూడా వ్యక్తిత్వంతో, సంస్కారంతో ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉంటూ ఒప్పారుతాయి. కథానిర్వహణ, ఔచిత్యం కోసం చేసిన మార్పులు ఈ నాటకానికి అదనపు అందం.

మనిషికీ ప్రకృతికీ ఉండే బంధాన్ని ఎంత చక్కగానో ప్రతిపాదించాడు కాళిదాసు ఈ నాటకంలో. శకుంతల - మొక్కలకి నీళ్ళు పోయకుండా తను మంచినీళ్ళు కూడా త్రాగేది కాదుట. చిగురుటాకులను అలంకరించు కోవటం ఎంత ఇష్టమయినా సరే తుంచేది కాదుట. తాను పెంచిన మొక్కకి పువ్వు పూస్తే పిల్లలు పుట్టినంత ఆనందించి ఉత్సవం చేసేదిట. ఇలా మొక్కలను సాటి మనుషుల్లా, సన్నిహితులుగా, బంధువులుగా చూపటం వాల్మీకికీ కాళిదాసుకే చెల్లింది.

గృహస్థులకు కూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు ఉండే బాధ, కణ్వ మహర్షి - అల్లుడైన దుష్యంతుడికి పంపే సందేశం, ఆడపిల్ల అత్తవారింట ఎలా ఉండాలో శకుంతలకి చెప్పిన సుద్దులు ఇవన్నీ లోకోత్తరమైనవి.

కావ్యేషు నాటకం రమ్యం.. - అంటూ సంస్కృత కావ్యాలలో నాటకం, నాటకాలలో అభిజ్ఞాన శాకుంతలం, అందులో నాలుగో అంకం, దానిలో నాలుగు శ్లోకాలూ రమ్యమైనవన్న ప్రసిద్ధి ఒక్క ఈ నాటకానికి ఉంది. అంటే ఆ నాలుగు శ్లోకాలు ఈ నాటకానికి ప్రాణం అన్నమాట. మరి ఈ నాలుగు శ్లోకాలలో ఏముందో, ఇంకా ఇందులో ఏ పరిమళం దాగుందో చూస్తేనే కదా తెలిసేది. కాళిదాసు కవిత్వం ఒక గంధపుచెక్క. అరదీసుకున్నవారికి అరగదీసుకున్నంత.

- డా. అద్దంకి శ్రీనివాస్

Preview download free pdf of this Telugu book is available at Abhijnana Sakuntalam