-
-
అబ్దుల్ కలాం
Abdul Kalam
Author: Dr. Velaga Venkatappaiah
Publisher: Swathi Book House
Pages: 40Language: Telugu
మనం తరచు వింటూ ఉంటాం. సాధించే విజయాల మధ్య రహస్యం ఏదీ లేదు. కేవలం కష్టించి పనిచేయడమేనని. అంటే మరేం లేదు. మనం కష్టపడి చదువుకోవాలి. పనిచేయాలి. ఫలితం దానంతట అదే వస్తుంది. ఇదే విజయానికి రహస్యం అని అంటారు పెద్దలు. ఇలా విజయం వరించిన వారిలో భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం ముఖ్యులు.
కలాంజీ ఒకప్పటి మన రాష్ట్రపతి. రాష్ట్రపతి పదవి దేశంలో అత్యున్నత పదవి. భారత ప్రజలందరం ఎన్నుకొన్న వ్యక్తి. వారి పాలనతో దేశం ముందుకు నడుస్తుంది. కలాంజీ కృషికి ప్రతిరూపం, కృషికి మరో రూపం. కలాంజి తొలుత శాస్త్రవేత్త. తరువాత సాంకేతిక విజ్ఞాన వేత్త. ముందు ఆలోచన కలవారు. భారతదేశాన్ని భారతీయులే అభివృద్ధి చేసుకోవాలి'' అంటారు. అందుకు అందరం శ్రమించాలి అనుకుంటారు. వీటన్నిటినీ మించి కలాంజీకి -
బాలలంటే ఇష్టం
యువజనులంటే మరీ ఇష్టం
శాస్త్రవేత్తలంటే ఎంతో ఇష్టం
శ్రమ జీవులంటే ఇంకా ఇష్టం
దేశ ప్రగతికి వీరంతా అవసరమని వారి భావం. ఈ నలుగురు దేశం అనే భవనానికి నాలుగు స్తంభాలని వారి భావన.
* * *
ఈ పుస్తకంలో అబ్దుల్ కలాం యువజనగీతం, విజయ రహస్యం మొదలగు విషయలను మనకు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారు పిల్లల బొమ్మలతో అందించారు.
- స్వాతి బుక్ హౌస్
