-
-
ఆశ ఉందిగా...
Aasa Undiga
Author: Kolluri Soma Sankar
Publisher: Self Published on Kinige
Pages: 84Language: Telugu
వివిధ పత్రికలలో ప్రచురించబడిన అనువాద కథల సమాహారమే ఈ ‘ఆశ ఉందిగా...’ అనే ఈ-బుక్.
ఈ పుస్తకంలో పన్నెండు కథలున్నాయి. చాలా కథలలో సామాన్యంగా ఉన్న విషయం మానవీయత. ఇంచుమించుగా అన్ని కథలూ కథకులు చెబుతున్నట్టుగా ప్రథమ పురుషలో సాగుతాయి. దిగువ మధ్యతరగతి లేదా పేద కుటుంబాలలో ఉండే పరిస్థితులను హృద్యంగా వివరిస్తాయి. దాదాపుగా అన్ని కథలూ మనసు లోతుల్లోని తడిని స్పృశిస్తాయి.
ఈ కథలు వ్రాసిన రచయితలందరూ వేరు వేరు అయినా అన్ని కథలూ ఒకే కలం నుంచి వచ్చిన భావన, అనువదించిన శ్రీ కొల్లూరి సోమ శంకర్ గారి శైలి వలన మనకు కలుగుతుంది. మూలకథ లోని కథనే తన పదాలలో మరింత చక్కగా వ్రాసి పాఠకుల మనసులకు నచ్చేలా అందించిన శ్రీ సోమ శంకర్ గారు ఎంతో అభినందనీయులు.
సరళమైన భాషలో, చక్కని శైలిలో, సూటిగా ఉండే కథనంతో ఉన్న ఈ కథలను చెబితే తప్ప అనువాద కథలని ఎవ్వరూ అనుకోరు. చదువుతున్నంత సేపూ ఆనందింపజేసి, చదివిన తరువాత ఆలోచింపజేసే ఈ ‘ఆశ ఉందిగా...’ కథా సంపుటిని మనమందరమూ తప్పక చదవాల్సిందే... ఒక మంచి అనుభూతికి లోనవ్వాల్సిందే.
- నండూరి సుందరీ నాగమణి, ప్రముఖ రచయిత్రి.
