-
-
ఆరు నెలలు ఆగాలి
Aaru Nelalu Agali
Author: P. S. Narayana
Publisher: Sahiti Mitrulu
Pages: 160Language: Telugu
ఈనాడు సమాజంలో స్త్రీలపై అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. మూడేళ్ల బాలికపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు వింటున్నాం, చదువుతున్నాం. 'నిర్భయ' ఎలా జీవితంలో ఓడిపోయిందో చదివాం, బాధపడ్డాం. ఇంత దారుణంగా సమాజం ఎందుకుంది? స్త్రీకి రక్షణ లేదా? స్వేచ్ఛగా జీవించే హక్కు లేదా? వాళ్ళూ సమాజంలో భాగం కాదా? ఇలా అనేక ప్రశ్నలు మన ముందున్నాయి. ఇదంతా వాస్తవం.
ఈ వాస్తవాన్ని రచయిత 2010లోనే ఊహించాడు, స్పందించాడు. రచన చేశాడు నవలగా. 'చారులత' అనే యువతి తనపై జరిగిన లైంగిక అత్యాచారానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంది? ఎలా పోరాడి ధీరవనితగా నిలబడిందో చెప్పే నవల ఇది. ఈ నవలలో కథ, కథనం, పాత్రలు, సంఘటనలు - అన్నీ కల్పనలే కావచ్చు కానీ అన్నీ సమాజ సాంఘిక పరిస్థితులకు ప్రతిరూపాలు. మంచివాళ్ళు, స్వార్థపరులు, బుద్ధిహీనులు, దగాకోరులు, ఆత్మీయులు, అవకాశవాదులు, మధ్యతరగతి మనుషులు - ఇలా నవలంతా మనం చూస్తున్న సమాజం సజీవంగా కనపడుతుంది. వీళ్ళంతా మధ్యతరగతి వాళ్ళే సుమా, వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, కోరికలు, బ్రతుకు సమరం, భయం, మూఢనమ్మకాలు - ఇలా అన్నీ నవలలో ఉన్నాయి.
ఇవిగాక, కొంత నేరపరిశోధన కూడా జోడించడంతో నవలలో ఆసక్తి పెరిగింది. పాఠకుడిని ఆద్యంతం ఉత్సాహంగా ముందుకు తీసుకువెడుతుంది.
శ్రీ పి. ఎస్. నారాయణ పుట్టిందీ, పెరిగిందీ, జీవిస్తున్నదీ - గమనించిందే మధ్యతరగతి మానవ సమాజంలో. అందుకే ఆయన రచనలు ఆ సమాజానికి దగ్గరగా, సన్నిహితంగా వుంటాయి.
- ఎన్. తారక రామారావు
