-
-
ఆపస్తంబ ధర్మ సూత్రమ్
Aapastamaba Dharma Sutram
Author: Dr. N. L. Narasimhacharya
Publisher: Gayathri Prachuranalu
Pages: 176Language: Telugu
ఆపస్తంబ ధర్మ సూత్రమ్
ఈ పుస్తకం గురించి రెండు మాటలు
తెలుగునాట ఉన్న ద్విజులలో చాలామంది ఆపస్తంబసూత్రులు. ప్రతిదినం సంధ్యావందనం చేస్తున్నప్పుడు తమ ప్రవర చెప్పుకుంటూ ఈ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకొంటూ ఉంటారు. కానీ క్రీ.పూ. 8-7 శతాబ్దులకు చెందిన ఆపస్తంబ మహర్షి చెప్పిన ధర్మవిషయాలు తెలిసినవారు చాలా తక్కువ.
ఈ గ్రంథంలో ఆపస్తంబ మహర్షి ఉపనయన సంస్కారం చేసికొన్న బ్రహ్మచారి (విద్యార్థి) గురుకులంలో అనుష్ఠించాల్సిన నియమాలు, ప్రవర్తించవలసిన పద్ధతులను చెప్పుతునే గురువు కూడా శిష్యుని పట్ల ఏ విధంగా ఉండాలి మొదలైన విషయాలను కూడా వివరించినాడు.
అట్లే సంస్కారరూపమైన వివాహాన్ని చేసికొన్న గృహస్థు అవలంబించాల్సిన విధులను వివరిస్తూ, అతిథి అభ్యాగతులతో పాటు ఇంటిలో ఉన్న ముసలివారికి, చిన్నపిల్లలకు, చివరకు ఇంటిపనులు చేసే దాస, దాసీజనానికి భోజనం పెట్టిన తరువాతనే ఇంటియజమాని తన భార్యతో కలసి భుజించాలి అని ఇంటి పనివారిపై మిక్కిలి దయచూపించిన కరుణామయుడు.
వానప్రస్థులు (రిటైర్ ఐనవారు?), జ్ఞానసంపాదనే పరమార్థంగా పెట్టుకొని పరబ్రహ్మను ఉపాసించే సంన్యాసులు అనుష్ఠించాల్సిన ధర్మాలను వివరించాడు. ఇంకా, అనధ్యయములు, శ్రాద్ధము, అస్తిపంపకము, రాజధర్మాలు, ప్రాయశ్చిత్తాలు మొదలైన అనేక విషయాలను చెప్తూ తప్పుచేసినవారి గురించి చాలా కఠినమైన ప్రాయశ్చిత్తాలను విధిస్తునే భర్త చనిపోయి సంతానం లేనప్పుడు సంతానానికై అవలంబిస్తూ వచ్చిన 'దేవర న్యాయాన్ని' గట్టిగా వ్యతిరేకించినాడు.
తనకు తెలియని విద్యలను స్త్రీలనుండి, శూద్రులనుండి కూడా నేర్చుకొనవలెనని అప్పుడే సంపూర్ణంగా విద్య నేర్చుకొన్నట్లవుతుందని తెలిపిన విశాలహృదయుడు. ఇంకా తాను చెప్పకుండా వదలివేసిన కులాచార ధర్మాలేవైనా ఉంటే వాటిని ఆయా కులాలకు చెందిన స్త్రీల దగ్గర నేర్చుకోవాలని స్త్రీలకు పెద్దపీట వేసిన మహనీయుడు. వివాహమహోత్సవదినం (నేటి మ్యారేజీ డే) వంటి విషయాలెన్నో ఈ గ్రంథాన్ని పరిశీలిస్తే కనిపిస్తాయి.
శ్రద్ధతో పరిశీలనాదృష్టి కలిగి చదివితే ఇట్టి విషయాలెన్నో మనకు తెలుస్తాయి.
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
There's. No books of apastamba dharma