-
-
ఆనవాళ్ళు
Aanavallu
Author: Lade Dhananjaya
Pages: 128Language: Telugu
శ్రీ లాడె ధనంజయ గారి సంపాదకత్వంలో వెలువడిన "ఆనవాళ్ళు" అనే ఈ పుస్తకం భారతీయ గ్రామాలపై వెలువడిన కవితల సంకలనం.
* * *
పల్లెలు పాడయి ప్రకృతి ప్రమాదకరంగా మారితే ఆక్రోశించిన పల్లెతల్లి కన్నబిడ్డలు బలమైన అభివ్యక్తి, తీవ్రమైన ఆవేదనను, తీరని కోపాన్ని తీక్షణంగా చూపారు. గొప్ప కవితా సౌందర్యం వెల్లివిరిసింది. 'ఇంకేమి మిగిలిందిరా' చదువుతుంటే సహృదయులు కంటతడిపెడతారు. 'కాలిబాట' కరువైన పల్లెను కొందరు కవులు ఊహించుకోలేరు.
- ఆచార్య కొలకలూరి ఇనాక్
* * *
నిజానికి భారతదేశంలో సరళీకృత ఆర్ధికవిధానాలకు తెరతీసినప్పుడే భారత గ్రామీణ విధ్వంసం మొదలైంది. ప్రపంచీకరణ పేరుతో వెల్లువెత్తిన విదేశీ మార్కెట్లు పల్లెల్లో కులవృత్తుల విధ్వంసంతో ఆగక వారాంతపు సంతలను కూడా మిగలనివ్వని దుస్థితికి తీసుకొచ్చాయి. ఈ సంకలనం కవులపరంగా చూస్తే కొత్తతరం కవులతో పాటు ప్రసిద్ధులూ ఉన్నారు. ప్రక్రియపరంగా గేయకవిత్వం, వచన కవిత్వం చోటు చేసుకున్నా, సంఖ్యాపరంగా చూస్తే గేయాలే ఎక్కువగా ఉన్నాయి. బహుశా గ్రామీణ సంస్కృతికి గేయానికున్న విడదీయరాని, విడదీయలేని అనుబంధమే దీనికి కారణం కావచ్చు.
- ప్రొ. శిఖామణి
