-
-
ఆమె ఓ ప్రభంజనం
Aame O Prabhanjanam
Author: Dr.K.Kiran Kumar
Publisher: Sri Vaibhava Publications
Pages: 181Language: Telugu
ఆకాశం పగిలింది మిరుమిట్లుగొలుపుతూ. దట్టంగా అలుముకున్న నల్లటి మబ్బుల్లోంచి ఒక్కోక్క చినుకు నెమ్మదిగా కిందికి జారసాగింది.
తన ముందున్న భర్త కేసి చూసిందామె..
అతడిలో ప్రాణంలేదు. శవమై ఉన్నాడు.
చీకటి... గాలి... వర్షం... ఎన్నో సంవత్సరాలు తనతో కష్టసుఖాలు పంచుకున్నఅతడు..
అతడి తలలోంచి కారుతున్న రక్తం ఆమె ఒడిని తడుముతోంది.
స్తంభించిన వాయువు తిరిగి చలనం సంతరించుకుంటూ వర్షానికి తోడవుతుంది.
ఒక్క క్షణం. ఆమె కదిలింది అతివైపు. మృత్యువు ఓడిలో సేద తీరుతున్న అతడి నుదుటి మీద ఆమె పెదాలు ఆర్తిగా కదిలాయ్.
చీకటి కళ్ళు పెద్దది చేసి చూస్తోంది వాళ్ళకేసి భయపడ్డట్టుగా...
బయట వర్షం పెద్దదవుతోంది. ఎక్కడో పిడుగుపడ్డ శబ్దం.
తెరిచి ఉన్న అతి కళ్ళను తన చేత్తో మృదువుగా మూసేసింది ఆమె,
అతడి కనురెప్పలు మూసుకొన్నాయ్ శాశ్వతంగా... మృత్యువు ఒడిలోకి మనశ్శాంతిని వెతుక్కుంటున్నట్లుగా...
నిర్లిప్తంగా... ఉద్వేగరహితంగా చూస్తుండిపోయిందామె.
- ₹129.6
- ₹129.6
- ₹108
- ₹135.6
- ₹60
- ₹72
- ₹129.6
- ₹129.6
- ₹108
- ₹135.6
- ₹60
- ₹72
Enable rent option please