-
-
ఆమె నా భార్య కాదు
Aame Na Bharya Kadu
Author: P. S. Narayana
Pages: 213Language: Telugu
భర్తను గురించిన ప్రశ్నలు ఇంకేం వేస్తుందోనన్నట్లుగా భయం భయంగా ఆమెవంక చూసింది.
"మీ భర్తేం చేస్తుంటారు?" అడిగింది ఆఫీసరు.
"వ్యవసాయం!" పైకి వ్యక్తం కాకపోయినా కంఠంలో కసివున్నది.
"చదువుకోలేదా?"
"నాకంటే ఎక్కువ చదివారు!"
ఆమె స్మితనే చూస్తూ వుండిపోయింది కొన్ని క్షణాల వరకూ కన్నార్పకుండా. "ఫెంటాస్టిక్!" అన్నది.
స్మిత పెదాలను కదిపీ కదపకుండా నవ్వింది.
"మీ హబ్బీ మీరు అమెరికా వెళ్ళటానికి ఒప్పుకున్నారా?"
"అసలు ఇద్దరం కలిసే వెళ్ళవలసిన వాళ్ళం... అనుకోకుండా వారి తండ్రి మరణించడంతో ఒక సంవత్సరం ఇక్కడే వుండి పొలాలు చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది... చిన్నగా ఎక్కడ ఏదైనా ఏర్పాటు చేసి నాతో జాయిన్ అవుతారు.. ఆ తరువాత ఇంకో రెండేళ్లు వుండి ఇద్దరం తిరిగి వచ్చేయాలని!" అంది స్మిత.
"మీ హజ్బండ్కు ప్రాపర్టీస్ బాగా వున్నయ్యా?"
"పొలమే వంద ఎకరాల దాకా వుంటుంది.. అదిగాక తోటలు అవీ చాలా వున్నయి!" చెప్పింది స్మిత.
