• Aakhari Prayaanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆఖరి ప్రయాణం

    Aakhari Prayaanam

    Publisher: Ganti Prachuranalu

    Pages: 156
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పెద్దసాయి మృత్యుఛాయ- యీ నవలికకు Entry Point. చిన్న సాయి చిరునవ్వు Exit Point. ఈ రెండు ద్వారాల గుండా పయనించే పాఠకుడు కొన్నిసార్లు ఏకాంతంలోకి వెళ్ళిపోతాడు. ఆ నిశ్శబ్దంలో కొన్ని నిట్టూర్పులూ వింటాడు. గొప్ప భావుకురాలైన రచయిత్రి/ రచయిత మాత్రమే ఇట్టి 'మాజిక్‌'ను సృష్టించగలరు.

శ్రీమతి గంటి భానుమతి నిర్వివాదంగా గొప్ప భావుకురాలు. అవ్యక్తాన్ని వ్యక్తంగా పరివర్తించటానికి- ఆమెకు భాషా వైదుష్యం వున్నది. చిక్కని చక్కని శైలీ సౌందర్యంతో, ఈ నవలికను ఒక Auto Elegy గా, ఒక స్వశకలాల సంకలనంగా రూపుదిద్దిన శ్రీమతి భానుమతి- ప్రతిభా ఉపజ్ఞ వున్న రచయిత్రుల శ్రేణిలో సమున్నత స్థానంలో వుండగల ధీమతి. ''చేయి తిరిగిన రచయిత్రి'' అని సమీక్షకులు తరచు వాడే పదబంధం- చాలా పేలవంగా శ్రవణ పుటాలకు సోకుతుంది. కథా గమనం, లక్ష్యం ఆమెకు వశమైన శక్తులు. అవి సహజశక్తులే అని నా అభిప్రాయం.

- మునిపల్లె రాజు

* * *

ఆరోగ్య విషయాల పట్ల అవగాహన పెంచడానికి ఉపన్యాసాలు, వ్యాసాలే కాకుండా కథానికలు, నవలలు లాంటి సృజనాత్మక ప్రక్రియల ద్వారా పాఠకుల హృదయాన్ని కదిలించి, జ్ఞానాన్ని పెంపొందించవచ్చు. అలాంటి బృహత్‌ ప్రయత్నానికి పూనుకున్న ప్రముఖ రచయిత్రి గంటి భానుమతిగారికి అభినందనలు, కృతజ్ఞతలు. వారి కలం నుంచి ఇలాంటి మంచి మంచి రచనలు మున్ముందు ఇంకా అనేకం రావాలని ఆశిస్తూ...సెలవు.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Aakhari Prayaanam