It is a modern parable with age old ingredients and modern variants combining to produce a cocktail of deadly potential - a portent and threat to all values of Democracy. The narrative encapsulates the lethal connection between politics, media, muscle, and money not speak to of propaganda and falsehood.
- Prof. C. Subbarao
Former Chiarman, A.P. State Council of Higer Education
* * *
విలోమ కథలు రాసినప్పుడు - "ఈ దేశంలో మనుషులు మనుషుల్లా బతకడం లేదని, రాజకీయనాయక జీవిత విశ్వాసాలు విలువలు తలకిందులుగా నడుస్తున్నాయని" నగ్నముని కోపించాడు. ఈ కథ రాసేనాటికి, వ్యవస్టే తలకిందులుగా మారిపోయి, మనుషులు దాన్ని సత్యమని భ్రమించే పరిస్థితి ఏర్పడింది. అందుకే, పాఠకులకు నిగూఢవాతావరణ స్పృహ కల్పించిన కథనంలో, మార్మికతను, ఉత్కంఠను నిర్మించిన భాషాశైలిలో తప్ప రచయిత ఇందులో ప్రయోగశీలత చూపించకపోయినా, కథ విలోమవాస్తవికతనే ప్రతిఫలించింది. ఆకాశదేవర చుట్టూ వున్న మార్మికత మనం జీవిస్తున్న వ్యవస్థకు మనం అందిస్తున్న ఆమోదమే!
- కె. శ్రీనివాస్
సంపాదకులు, ఆంధ్రజ్యోతి
* * *
'నా గురించి పూర్తిగా నీకు తెలీదు. నేను కొన్ని పెద్ద కంపెనీలకు, వ్యక్తులకు సలహాదారుడినే. అంతకంటే ముఖ్యంగా నేను వ్యాపారస్తుణ్ణి కూడా. అది నీకు తెలీదు. సలహా, సలహాలతో మిళితమైన వ్యాపారం నాకు ముఖ్యమైనది. నా వ్యాపారం చాలా ఆధునికమైనది. మానవుడి మెదడును, అంటే ఆలోచనా సరళిని నేననుకున్న విధంగా మార్చుకునే వ్యాపారం.'
- మిస్టర్ కారష్
ఆకాశదేవరలో ఒక పాత్ర
