-
-
ఆగమ ప్రామాణ్యము
Aagama Praamaanyamu
Author: Dr. N. L. Narasimhacharya
Publisher: Gayathri Prachuranalu
Pages: 192Language: Telugu
“ఆగమ ప్రామాణ్యము” గ్రంథము గురించి:
భగవద్రామానుజులకు పరమాచార్యులైన శ్రీమద్యామున మునీంద్రులు మహాప్రతిభాసంపన్నులు. తమ తాతగారు, పరమాచార్యులైన నాథమునులు, వారి శిష్యుల మార్గాన్ని అనుసరించి పాంచరాత్రశాస్త్రము పరమ ప్రమాణమని తమ రచన ద్వారా లోకానికంతా చాటిచెప్పిన మహానుభావులు. వారి గ్రంథం పాంచరాత్ర ప్రమాణాన్ని సిద్ధాంతీకరిస్తున్న తొలి గ్రంథం.
యామునులకు ముందే కొందరు వైష్ణవాలయాలలో ప్రతిష్ఠా, ఆరాధనాదులకు పరమ ప్రమాణంగా భావింపబడుతూన్న పాంచరాత్రశాస్త్రం అసలు ప్రమాణమే కాదని, దాన్ని ప్రమాణంగా పేర్కొనే ఇతర ప్రమాణాలేవీ లేవని, బాదరాయణుడు దీన్ని అవైదికమన్నాడని, లోకాన్ని వ్యామోహపరచుటకే ఇది చెప్పబడిందని, చతుర్దశవిద్యలలో దీనికి స్థానం లేదని, ఇది పాషండుల శాస్త్రమని, ఎన్నో విధాలుగా తప్పులుబట్టడం ప్రారంభించినారు.
పైగా వైష్ణవాలయాలలో అర్చకులుగా ఉన్న భాగవతులు బ్రాహ్మణులే కాదని, వారి ఆచారాలు, బ్రాహ్మణుల ఆచారాలకు భిన్నమని, పంచసంస్కారాలు వైదికం కావని, వారు వ్రాత్యులని, శ్రీమన్నారాయణుని నిర్మాల్యాలను, నైవేద్యాన్ని స్వీకరింపకూడదని, అనేకవిధాలుగా ప్రచారం చేయసాగినారు. మరికొందరు విద్వాంసులు బ్రహ్మసూత్రాలలోని ఉత్పత్యధికరణమునకు విపరీతమైన వ్యాఖ్యలను చేయసాగినారు.
ఈవిధంగా చేస్తున్న విరుద్ధప్రచారాలలోని ప్రతీ అంశాన్ని మీమాంసా, తర్కశాస్త్రాదులలో ఉన్న తమ అమోఘమైన ప్రతిభాపాటవాలచే యామునాచార్యులవారు ఖండించినారు.
పాంచరాత్రశాస్త్ర ప్రామాణ్యాన్ని తెలిపే ఈ తొలి గ్రంథం దేవనాగర లిపిలో తప్ప తెలుగులిపిలో లభ్యము కాదు. దీనికి వ్యాఖ్యలను కూడా పూర్వీకులు అనుగ్రహించినట్లు కనిపించదు.
ఇటువంటి గొప్ప గ్రంథాన్ని తెలుగులిపిలో, తెలుగు తాత్పర్యంతో తెలుగువారికి అందించడానికి చేసిన చాలా చిన్న ప్రయత్నమిది.
శాస్త్రప్రవేశమున్నవారికీ, చాలా పరిశ్రమ తరువాతనే అర్థమయ్యే శాస్త్రవిషయాలను మాత్రం కొంత పక్కకు పెట్టి, పాంచరాత్ర ప్రామాణ్యానికి యామునాచార్యులవారు చేసిన అమోఘకృషిని సహృదయతతో కొంతైనా తెలిసికొనేందుకు ప్రయత్నించి ధన్యులమౌదాం.

- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162