-
-
ఆదివాసులు చట్టాలు - అభివృద్ధి
Aadivasulu Chattalu Abhivruddhi
Author: K. Balagopal
Publisher: Perspectives
Pages: 170Language: Telugu
ఆదివాసుల గురించి బాలగోపాల్ రాసిన వ్యాసాలు ఇప్పటికే రెండు సంపుటాలుగా వచ్చాయి. ఒకటి 'ఆదివాసులు: వైద్యం సంస్కృతి అణచివేత' కాగా రెండోది 'ఆదివాసులు: ఛత్తీస్గఢ్, కంధమాల్పై వ్యాసాలు, నివేదికలు. ఆదివాసుల సిరీస్లో ఇది మూడవది, చివరిదీ. ఇందులో ప్రధానంగా ఆదివాసీ చట్టాల అమలుకు ఎదురవుతున్న ఆటంకాలను, 'అభివృద్ధి' పేరు మీద వారికి జరుగుతున్న అన్యాయాలను చర్చకు పెట్టారు బాలగోపాల్.
ఆదివాసుల భూమి హక్కులను పరిరక్షించే చట్టాలలో '1 ఆఫ్ 70' చాలా ముఖ్యమైనది. అయినా దాని అమలుకు జరిగిన కృషి కంటే ఉల్లంఫిుంచడానికి జరిగిన ప్రయత్నాలే ఎక్కువ. అలాగే ఏజెన్సీలో ఆదివాసీయేతరులెవరూ మైనింగ్ వంటి కార్యకలాపాలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు సమతా కేసులో ఇచ్చిన తీర్పు కూడా ఆదివాసుల జీవన భద్రతకు సంబంధించి చాలా కీలకమైన తీర్పు. అయినా వివిధ ప్రభుత్వాలు వివిధ రూపాలలో ఈ తీర్పును ఉల్లంఫిుంచడానికి ప్రయత్నిస్తూనే వచ్చాయి. ఈ అతిక్రమణలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడాగట్టడానికి బాలగోపాల్ విస్తృతంగా - కరపత్రాలు, వ్యాసాలు, రిపోర్టుల రూపంలో - రాశారు. ఎన్నిసార్లు రాసినా సందర్భాలు వేరు అవడం వలన ప్రతిసారీ కొత్త అంశాలు చర్చకు వచ్చాయి. అందుకే - కొంత పునరుక్తి ఉన్నప్పటికీ - వాటిని యథాతథంగా ఉంచేశాం.
ఇవి ఇరవై ఏళ్ల కాలంలో రాసిన వ్యాసాలు. 'హక్కులు అమలు చేయించుకోవానికి చట్టాలొక్కటే సరిపోవు. ప్రజల వైపు నుండి రాజకీయ ఒత్తి కూడా అవసరం' అని చివరి వ్యాసాలలో ఆయన గట్టిగానే హెచ్చరించారు. ఆ దిశగా కృషి చేసే ప్రజాతంత్ర శక్తులకు ఈ పుస్తకంలోని వ్యాసాలు చాలా ఉపయోగపడగలవు.
- పబ్లిషర్స్
