-
-
ఆదివాసులు
Aadivasulu
Author: K. Balagopal
Publisher: Perspectives
Pages: 147Language: Telugu
ఒక ఇంద్రవెల్లి (1981 ఏప్రిల్ - ఆదివాసులపై రాజ్యం హత్యాకాండ), ఒక చింతపల్లి (1987 మార్చి/మే - ఆదివాసీ గూడేల దహనం), ఒక వాకపల్లి (2007 ఆగస్టు - గ్రే హౌండ్స్ అమానవీయ అత్యాచార దాడి) - ఇదీ ఆదివాసుల పట్ల స్వతంత్ర భారతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఆదివాసులకు, ఆధునిక ప్రపంచానికి మధ్యనున్న అంతరం తగ్గించేందుకు కృషి చేయాల్సిందిపోయి ప్రభుత్వాలు అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాలు, కార్పొరేటీకరణ ఆదివాసుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వాళ్ళ జీవన విధ్వంసంతో ప్రారంభమైన దాడి వాళ్ళ సాంస్కృతిక మూలాలను విచ్ఛిన్నం చేస్తోంది.
ఆదివాసీలంటేనే రాజ్యానికి నేరస్తులుగా కనిపిస్తున్నారు. నిత్య అనుమానితులుగా, పూర్తి అభద్రతలో వారి జీవితాలు కునారిల్లుతున్నాయి. వాళ్ళ కాళ్ళ కింది భూమి, వాళ్ళు జీవించిన ప్రకృతి వాళ్లకి పరాయిదై పోయింది. విద్య, వైద్యం వాళ్ళ దరిదాపులకే చేరం లేదు. డయేరియా, మలేరియా లాంటి నయం కాగల జబ్బులకు కూడ ఏటేటా క్రమం తప్పకుండ వందలాది మంది ఆదివాసులు మరణించడం మరో పెద్ద విషాదం. ''రాజ్యానిదీ, న్యాయస్థానానిదీ ఒకే వైఖరి అయినప్పుడు బాధితులకు మిగిలిన ప్రత్యామ్నాయం ఏమిటనేది పౌర సమాజం చర్చించాల్సిన సమస్య'' అన్నాడు బాలగోపాల్.ఇంత అధికార హత్యాకాండ మన పక్కన జరుగుతుంటే, చైతన్యవంతమైన సమాజం అడుగులు ఎటువైపు సాగాలో దిశా నిర్దేశం చేసుకోవాలని బాలగోపాల్ హెచ్చరిస్తున్నాడు.
- ఆర్.కె, పర్స్పెక్టివ్స్
