-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఆ ఊరి పక్కనే ఒక ఏరు (free)
Aa Oori Pakkane Oka Eru - free
Author: Kotra Siva Rama Krishna
Publisher: Self Published on Kinige
Pages: 323Language: Telugu
ఇరవై ఒక్క ఏళ్ల సుస్మితకి తన తల్లి తండ్రి ఇద్దరూ తన పదహారో సంవత్సరంలోనే ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోవడం వల్ల మాత్రమే కాదు, తన తండ్రి రాసిన ఒక వింత వీలునామా వల్ల కూడా పెద్ద చిక్కు వచ్చిపడింది. ఆ వంశంలో తరతరాలుగా వస్తూన్న ఆచారం ప్రకారంగా, అందరూ రాస్తూ వస్తున్నట్టే, ఇరవై రెండేళ్లు దాటి పెళ్లి చేసుకుంటే తప్ప తన కూతురికి తన ఆస్తి మీద హక్కు రాదని, అలాగే ఇరవై రెండేళ్ల లోపు పెళ్లి చేసుకుంటే ఎటువంటి హక్కు తన ఆస్తి మీద ఉండదని విల్లు రాసాడు సుస్మిత తండ్రి. ఆ వంశంలో కొంతమంది ఆడవాళ్ళూ ఇరవై రెండు సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసుకుని ఆస్తులు తగలేస్తే, ఇంకొంత మంది చాలాకాలం పాటు పెళ్లి చేసుకోకుండా వుండి ఆస్తులు తగలెయ్యడం వల్ల ఆ వంశంలో మగవాళ్లందరూ అటువంటి వీలునామాలు వ్రాస్తూ వస్తున్నారు. అందువల్ల సుస్మిత తండ్రి కూడా అలాంటి వీలునామా రాసాడు. గుంటనక్క లాంటి తన మామయ్య వసంతరావు, అత్తయ్య పంకజం, బావ శేషేంద్ర తను ఇరవై రెండో సంవత్సరంలో ప్రవేశించి, పెళ్లి చేసుకుని, ఆస్తి మీద హక్కు సంపాదించక ముందే చంపేయాలని ఆలోచిస్తూవుంటే, ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఎక్కడికైనా వాళ్ల ముగ్గురికి తెలియని చోటుకి వెళ్లిపోవాలని ఆలోచిస్తూండగా, సమస్యంతా తీరడానికి సుస్మితకి గుర్తుకు వచ్చిన ఒకే ఒక వ్యక్తి తను ఇష్టపడే మదన్. మదన్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది ఏమిటంటే, తనని ఆఖురుసారి చూసి, మాట్లాడి నాలుగు సంవత్సరాల పైన అయింది. అంతే కాకుండా కాలేజీ లో చదివే రోజుల్లో ఎదో చిలిపితనంతో అవమానించింది కూడా. తన మనసులో ఎవరన్నా ఉన్నారేమో, పెళ్లి అయిపోయిందేమో కూడా తెలియదు. ఒకప్పుడు తను చేసిన అవమానానికి ఎలా స్పందిస్తాడో, ఒకవేళ ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే తనకి పెళ్లి అయిపోయివుంటుందో, లేక తన మనసులో ఇంకా ఎవరన్నా ఉన్నారేమో తెలియక మధన పడుతూ వున్నా, మదన్ దగ్గరికే వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చేసింది సుస్మిత. మదన్ రూమ్ లో అనుకోకుండా అతని డైరీ చదివి, ఒక సీక్రెట్ తో మదన్ ని బ్లాక్మెయిల్ చేసి అతని ఇంట్లో ఆశ్రయం సంపాదించినా, త్వరలోనే విషయం అంతా అతనికి చెప్పి, అతని ప్రేమని పొందడమే కాకుండా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చాక తన సమస్య పూర్తిగా తీరిపోయినట్టుగానే అనిపించింది సుస్మితకి.
కానీ తను డైరీ లో చదివిన చిట్టిరాణి ఎవరైతే మదన్ ని ప్రేమించి పెళ్లిచేసుకోమని వేధిస్తూ, పెనుగులాటలో నదిలో పడిపోయి చనిపోయిందో, తిరిగి సుస్మిత ముందుకి మళ్లీ మళ్ళీ వచ్చినప్పుడు సమస్య అంతా మొదలైంది. చిట్టిరాణి దయ్యం గా మారి మదన్ మీద పగ తీర్చుకోవాలని చూస్తూందని సుస్మిత భయపడుతూవుంటే, ఏ దయ్యాలు భూతాలు లేవని, సుస్మిత ది కేవలం మానసిక సమస్యేనని, తన కజిన్ ఇంకా సైకాలజిస్ట్ తనూజ ద్వారా ఆ సమస్యని పరిష్కారించడానికి మదన్ ప్రయత్నాలు మొదలుపెట్టాక జరిగిన వింత సంఘటనల సమాహారమే ఈ స్పైసీ అండ్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'ఆ ఊరి పక్కనే ఒక ఏరు.'
