-
-
ఆ నేల, ఆ నీరు, ఆ గాలి
Aa Nela Aa Neeru Aa Gaali
Author: Veluri Venkateswara Rao
Publisher: Veluri Venkateswara Rao
Pages: 192Language: Telugu
ఎటొచ్చీ రెండు విషయాల్లో మాత్రం రంగనాథం మాములు రంగనాథమే. మొదటిది బజారులో ఏం చెత్త తినొచ్చినా రాత్రికి ఇంటికి రాంగానే ఇంత ఆవకాయ అన్నమో, గోంగూర అన్నమో దబదబ తినేస్తాడు, ఎవళ్ళో చూస్తారేమో అన్నట్టు. రెండోది, ఇంకా ఇంగ్లీషు తెలుగులానే మాట్లాడుతాడు, పుస్తకంలో పేరాగ్రాఫుల్లా...
- మెటామార్ఫసిస్ కథ
* * *
ఆ అమ్మాయి ఎం.ఎ. ఎందులో చేసిందో నాకనవసరం. బంగారపుబొమ్మ అయితేనేం? రాతివిగ్రహం అయితేనేం? ఆవిడ చేస్తున్న ఉద్యోగం సోషల్ వర్కర్ ఉద్యోగం. ఇకపోతే, సంగీతంలో ఎంత పాండిత్యం ఉన్న అమ్మాయి అయినా అమెరికా వచ్చి ఏం చేస్తుంది చెప్పు? ఇంట్లో కూర్చుని త్యాగరాజ కృతులు పాడుకుంటుందా? సోషల్ వర్కర్లు, సంగీత విద్వాంసులు ఎక్కడ మాత్రం ఎవరికి కావాలి?
- తీన్ కన్య కథ
* * *
వేలూరి కథలు అమెరికా తెలుగువాళ్ళ వ్యవహారశైలిపై సుతిమెత్తగా చురకలంటించిన వ్యంగ్య కథలు. కథని నిర్మించడంలో, నడిపించడంలోనూ ఆయనకొక ప్రత్యేక పద్ధతి ఉంది. అది అమెరికాలోని ఇతర తెలుగు రచయితల శైలికి భిన్నమైనది. హాస్య, వ్యంగ్య ధోరణిలో కథలు నడిపినా, వాటిల్లో ఆవేదనా, ఆవేశమూ ఉన్నాయి. అవి పాఠకులను అలరిస్తునే ఆలోజింపజేస్తాయి. ఇది వేలూరి వారి ప్రత్యేకత.
- వాసిరెడ్డి నవీన్
