-
-
ఆ చిరునవ్వు నా స్వంతం
Aa Chirunavvu Naa Swantam
Author: P. Chandra Sekhara Azad
Publisher: Janaki - Azad Prachuranalu
Pages: 61Language: Telugu
ఈ కథలో చదివించే మత్తు ఉండదు. ఆస్వాదన ఉంటుంది. ఎందుకంటే మత్తు వీడిపోతే దాని నుండి దూరమైపోయినట్లే. ఆస్వాదన జ్ఞాపకాల తలపులని నిరంతరం తడుతునే ఉంటుంది.
కథని అల్లిన విధానం తనదైన రచనా నిర్మాణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పాత్రల ఆలోచన మాటల్లో సూటిగా చెప్తాయి. ఒక్కో సన్నివేశంలో పాత్ర మనతో సాన్నిహిత్యాన్ని పెంచుకుని తమ వైపు ఆలోచింపచేసేలా చేసి - చేయుచ్చుకుని మరీ ప్రయాణించేలా చేస్తుంది. అందుకే పాత్ర అనే అద్దంలో పఠిత బింబం కనిపిస్తుంది. దానిలో ఉండే ఆత్మ అది ప్రేమించే విధానం వెంటాడుతూ ఉంటుంది. భేషజాల కన్నా భావ ప్రకటనకి నిర్దిష్టమైన అభిప్రాయాలకి ప్రాధాన్యత చెబుతున్నట్టుగా ఉంటుంది. సంసారంలో భావుకతకి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ నవల చెప్తుంది.
కథని నిర్ధిష్టంగా ఈ పద్ధతిలోనే నడపాలనే కృత నిశ్చయంతో రచయిత ఉండడం వలన ఇంకా పొడిగించడం కోసం ప్రక్కదార్లు పట్టి కళ్ళను చికిలించి మార్గాలను అన్వేషిస్తున్నట్టుగా ఉండదు. అందుకే ఈ కథ కూర్చోపెట్టి చెప్తున్నట్టుగా ఉండదు. కుర్చీలో విలాసవంతంగా కూర్చుని తెరమీద చూస్తున్న చలన చిత్ర సన్నివేశంలా ఉండదు. మనసు పొరల్లో అంతవరకు జరిగిన ఓ యధార్థ సంఘటనకి సన్నివేశాలను గుది గుచ్చి గుండె గదుల్లోకి వాటి తరంగాలను పంపుతున్నట్టుగా ఉంటుంది. అందుకే "ఆ చిరునవ్వు నా స్వంతం".. సంసార పక్షమైన రచన. చదవదగ్గది.
- యజ్ఞప్రసాద్
