-
-
ఏవిఎమ్ కార్టూన్లు కాలమ్ కథలు 2
AVM Cartoons Column Kathalu 2
Author: AV Mohan Guptha
Publisher: AV Mohan Guptha
Pages: 112Language: Telugu
రైల్లో మానస ప్రయాణిస్తోంది ఎంతో టెన్షన్‌గా!
ఆత్రుతగా రాబోయే స్టేషను గురించి తెగ వాకబు చేస్తోంది.
పక్కనే వున్న 65 ఏళ్ళ రిటైర్డ్ ప్రిన్సిపల్ సరిత ''ఎందుకమ్మా అంత కంగారుగా టెన్షన్ పడుతున్నావ్!? నగలు, డబ్బుగాని పోయిందా!? నీతో వచ్చి మీ ఇంటి వద్ద నిన్ను భద్రంగా దిగబెడతా'' అన్నది అనునయిస్తూ.. తను రాసుకునే రామకోటిని పక్కన పెడ్తూ.
''కాదండి! ఓ ఫ్రెండ్ విజయవాడ స్టేషన్లో కలుస్తానన్నది...''
ఆఁ...అదిగో వస్తోంది 'రాధ'. అమ్మయ్య అన్నది మానస.
రాధ, మానస చెవిలో గుస గుసలాడింది.
రైలు కదిలింది....
''ధ్యాంక్గాడ్'' అని గుండెల మీద చేతులు వేసుకున్నది మానస.
''ఏం జరిగిందీ!?'' అన్నది ప్రిన్సిపాల్ కుతూహలంగా.
''నేను ఆరింటికే రైలు ఎక్కా!''
''టిఫిన్ తినలేదనా!? ఆవిడ టిఫిన్ ఏం తేలేదే!?
అది కాదండి! ఏడుగంటలకు వచ్చే సీరియల్లో 'లావణ్య'కు ఏమైందో యమా టెన్షన్‌గా వుంది. ఫ్రెండుకి ఫోన్ చేసి చెప్పా! విజయవాడ స్టేషన్లో కలిసి ఈరోజు సీరియల్ కథని చెప్పమని.
........................................
మరాశ్రీ మరాశ్రీ మరాశ్రీ అని తను రాసే రామకోటిని చూసి ఆశ్చర్యపోయింది ప్రిన్పిపల్ సరిత.
* * *
గమనిక: "ఏవిఎమ్ కార్టూన్లు కాలమ్ కథలు 2" ఈబుక్ సైజు 9.79 mb
