-
-
65 మంది తెలుగు రచయితల కొత్త కథలు
65 Mandi Telugu Rachayitala Kotta Kathalu
Author: Multiple Authors
Publisher: Vamsee Prachurana
Pages: 584Language: Telugu
యద్దనపూడి సులోచనారాణిగారంటే నాకు చాలా అభిమానం, సులోచనారాణిగారి రచనలు చదువుతూ వారికి అభిమానిగా మారాను. ఎప్పుడైనా సులోచనారాణిగారిని చూడగలనా అని అనుకునేవాణ్ణి. 2017లో వ్యక్తిగతంగా అమెను కలుసుకునే అదృష్టం కలిగింది. నేను, డా. కె.వి. కృష్ణకుమారిగారు, వంశీ రామరాజుగారు కలిసి వారి ఇంటికి వెళ్ళాం. ఆవిడ ఎంతో ఆప్యాయంగా పలకరించారు, చిరునవ్వుతో ఆహ్వానించారు.
తన ఇంట్లోని గ్రంథాలయంలోకి తీసుకువెళ్ళి 'మీకు ఏ పుస్తకం కావాలో తీసుకోండి' అన్నారు. అప్పుడు నేను 'జీవన తరంగాలు' పుస్తకం తీసుకున్నాను. ఆ నవల మీద తన సంతకం చేసి ఆనందంగా అందించారు. నాకది ఎప్పటికీ గుర్తుంచుకోదగిన అపురూపమైన కానుక. ఇప్పుడు వంశీవారు యద్దపూడి సులోచనారాణి స్మరణతో ప్రచురిస్తున్న ‘65 మంది తెలుగు రచయితల కొత్త కథలు’ కథా సంకలనానికి ఆర్థికదోహదం చేస్తున్నందుకు ఆనందిస్తూ సులోచనారాణిగారికి అశ్రునయనాలతో నివాళులర్పిస్తున్నాను.
- డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ
65 మంది కథా రచయితలు యద్దనపూడి సులోచనారాణిగారిపై ఉన్న అభిమానంతో కొత్త కథను ఈ సంకలనం కోసం రాయటం ఎంతో విశేషం. 65 మంది రచయితల అక్షరనివాళి ఇది. సులోచనారాణిగారు మానవతావాది, సహృదయులు, అజాత శ్రతువు, కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న అపర సరస్వతి ఆమె. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ ముగ్ధురాలైన మనోజ్ఞమూర్తి. మరపురాని, మరణంలేని మహారచయిత్రి యద్దనపూడి సులోచనారాణిగారికి రచయితల అక్షర నివాళి అందించడం నాకు ఒకింత మనశ్శాంతి.- డా. వంశీ రామరాజు
గమనిక: "65 మంది తెలుగు రచయితల కొత్త కథలు" ఈబుక్ సైజు 8.7mb
- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE