-
-
2009 ఎన్నికలు ప్రాంతీయ,
బడుగు పార్టీలకు హెచ్చరిక2009 Ennikalu Prantiya Badugu Partilaku Hechcharika
Author: Tankasala Ashok
Publisher: Hyderabad Book Trust
Pages: 85Language: Telugu
ప్రాంతీయ, బడుగు పార్టీలకు తమ ప్రత్యామ్నాయ అభివృద్ధి మోడల్ అంటూ లేక విఫలమై సృష్టిస్తున్న రాజకీయ శూన్యంలోకి కాంగ్రెస్ ప్రవేశిస్తుందా?
* * *
టంకశాల అశోక్ గారి స్వగ్రామం మడికొండ, వరంగల్ జిల్లా. హైదరాబాద్, ఢిల్లీలలో చరిత్ర, రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ వ్యవహారాలలో విద్యాభ్యాసం
వార్తలు రాయడం ఆరంభించింది 1966లో జిల్లా వారపత్రిక జనధర్మకు. అదే పత్రికలో 1967-72 మధ్య పూర్తి స్థాయి పని. 1972 నుంచి 77 వరకు ఆంధ్ర జనత, నవ్యాంధ్ర, ఈనాడు, ఆంధ్రభూమి దినపత్రికలలో హైదరాబాదులో ఉద్యోగాలు. 1979-80లో ఆంధ్రప్రభకు ఢిల్లీ నుంచి అంతర్జాతీయ వ్యవహారాల కాలమిస్ట్. 1984-94 మధ్య ఉదయం, ఆంధ్రప్రభలకు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి. 1994 నుంచి 96 వరకు హైదరాబాదులో అసిస్టెంట్ ఎడిటర్. తర్వాత వార్త ఉద్యోగం. 2002 వరకు అసిస్టెంట్ ఎడిటర్. తర్వాతి నుంచి ఎడిటర్.
పంజాబ్, కాశ్మీర్, కార్గిల్ యుద్ధం, శ్రీలంక, ఉత్తర భారత రాష్ట్రాల ఎన్నికలు, పాకిస్తాన్, ఇరాన్‌లపై ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక రిపోర్టింగ్‌లు.
ఎబికెతో కలిసి నాలుగు సంపాదకీయాల సంపుటాల ప్రచురణ. సముద్రం, ఒబామా జీవితం - ఆలోచనలు, ఒక జర్నలిస్టు ఆత్మవిమర్శ, తెలంగాణా రచనల సంకలనం - వివేచన ఇతర ప్రధానమైన ప్రచురణలు.
