-
-
1984 దిల్లీ - గుజరాత్ 2002
1984 Delhi Gujarat 2002
Author: Manoj Mitta and H.S.Phoolka
Publisher: Hyderabad Book Trust
Pages: 441Language: Telugu
మనోజ్ మిట్ట రాసిన ఉత్కంఠభరితమైన పరిశోధనాత్మక పుస్తకం ‘ద ఫిక్షన్ ఆఫ్ ఫాక్ట్ ఫైండింగ్ – మోదీ అండ్ గోద్రా’ చదివినప్పుడు మీకు భారతీయ మీడియా ప్రాధాన్యతలు ఏమిటా అని ఆశ్చర్యం కలుగుతుంది. మన ఘనత వహించిన ప్రజాస్వామ్యానికి బాకా ఊదడం విషయమై అది కించిత్తు కూడా సిగ్గుపడకపోవడం గురించి విస్మయం కలుగుతుంది.
మిట్ట చాలా మంచి పుస్తకం రాశారని చెప్తే సరిపోదు. గుజరాత్లో మోదీ నెలకొల్పిన ‘నమూనా న్యాయం’ను ఈ పుస్తకం తూర్పారబట్టింది. భారత ఉదారవాద ప్రజాస్వామ్యంపై చాలా కటువైన వ్యాఖ్యానాలు చేసింది. పత్రికా విలేకర్లతో సహా తగిన న్యాయ ప్రక్రియ మీద నమ్మకంతో కళ్ళు మూసుకొని కూచున్న వాళ్ళందరినీ మిట్టా ఎద్దేవా చేస్తాడు. వారి మూలంగానే న్యాయ వ్యవస్థను తెలివిగా కుప్పకూల్చారని, అది మోదీకీ ఆయనకంటే ముందరి 1984 అల్లర్లలో పాలుపంచుకున్న పలుకుబడివున్న నేతలకీ “క్లీన్చిట్”ని ప్రసాదించిందని అంటారు.
- రాజ్దీప్ సర్దేశాయ్, హిందుస్థాన్ టైమ్స్
* * *
1984 దిల్లీ అల్లర్లపై రాసిన పుస్తకంలో ఆయన న్యాయాన్ని కాలరాచేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించిన తీరును విశిష్టరీతిలో అధ్యయనం చేశారు. 2002 గుజరాత్ అల్లర్లపై రాసిన తన రెండో పుస్తకంలో ‘ చచ్చిన వారిదే తప్పు’ అని పాత ధోరణిని పటాపంచలు చేస్తూ ‘దర్యాప్తు జరిపిన వారిదే తప్పు’ అని తిరుగులేని విధంగా నిరూపించారు. అందంగా అలంకరించుకున్న ఒక దుష్ట శక్తి ప్రజాస్వామ్య భవిష్యత్తుకు ఆశాకిరణంగా మారుతున్న దౌర్భాగ్యపు కాలంలో మిట్టా రచన ఒక అభూతకల్పన అవుతుంది.
- నిత్యా రామకృష్ణన్, ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ
