• 1948 haidaraabaad patanaM
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 108
  120
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • 1948: హైదరాబాద్ పతనం

  1948 haidaraabaad patanaM

  Author:

  Pages: 210
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 2 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

హైదరాబాద్‌ విమోచన, విముక్తి, విలీనం, విద్రోహం, పోలీసు చర్య, ఆపరేషన్‌ పోలో....

1948లో భారత సైన్యం హైదరాబాద్‌ సంస్థానంపైకి దండెత్తినప్పటి ఘటనలను వివరించేందుకు ఇలా ఎన్నో పేర్లు వినపడతుంటాయి. నాడు చోటు చేసుకున్న చారిత్రక ఘటనల పరంపర ఒకటేగానీ వాటిని దర్శించే దృష్టి కోణాల్లోనే మరే సందర్భంలోనూ లేనంతటి తీవ్ర వైవిధ్యం, పరస్పరం సంఘర్షించుకునే భావ వైరుధ్యాలు ఎన్నో వ్యక్తమవుతుంటాయి. ఈ ఉద్వేగపూరిత కథనాల మధ్య చాలాసార్లు అసలు జరిగిందేమిటో గ్రహించటం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. నాటి ఘటనల చుట్టూ పేరుకున్న ఆ మాయనూ, మబ్బుతెరలనూ తొలగించి చూపిస్తుందీ మొహమ్మద్‌ హైదర్‌ రచన.

నాటి ఉద్రిక్త కాలంలో ఉస్మానాబాద్‌ కలెక్టర్‌గా పని చేశారు హైదర్‌. ఏడాది తిరగక ముందే ఆయనను తన జిల్లా జైలుకే పంపించారు. జైలులో గడుపుతూనే ఓ పరిపాలనాధికారిగా 1948 ఘటనలకు సంబంధించి తన ప్రత్యక్ష అనుభవాలను, జ్ఞాపకాలను కాగితంపై పెట్టారాయన. ఎంతో హుందాగా, అక్కడక్కడ చెణుకులతో సాగిపోయే ఈ రచన- ఎటువంటి ఆవేశకావేశాలకూ లోనుకాకుండా సాగిపోవటమే కాదు- చివరకు మన కళ్లు తెరిపిస్తుంది కూడా !

* * *

''స్వతంత్రం అనంతరం దేశంలో చోటుచేసుకున్న ఓ పెద్ద కూహకం గురించి దేశ పౌరులకు తెలియకుండా కప్పిపుచ్చటం, పైగా విదేశీ వర్గాలు దీన్ని బయటపెట్టిన తర్వాత కూడా దాచిపెట్టాలనే చూస్తుండటం దారుణం. 1948 మారణహోమం గురించి ముస్లిం మీడియాకూ తెలుసు. కానీ ఎక్కడా మాట్లాడదు. పైగా తన మౌనానికి హిందూ వర్గాల అణిచివేతే కారణంగా చూపిస్తోంది. ఓ ఉదారవాద ప్రజాస్వామ్యం పనిచేసే తీరు ఇది కాదు. నివేదికలను తొక్కి పెట్టటం, పాఠ్యపుస్తకాల్లో ఇటువంటి ప్రస్తావనలు కూడా రాకుండా తుడిచెయ్యడం ద్వారా భారత్‌ ఎన్నటికీ నిజమైన సమైక్య జాతిగా అవతరించ జాలదు.

- స్వామినాధన్‌ అయ్యర్‌,
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, 2012 నవబంరు, 26

Preview download free pdf of this Telugu book is available at 1948 haidaraabaad patanaM
Comment(s) ...

This is the only book available in public domain presenting the Hyderabadi point of view during the tragedy of 1948. Yes, to some extent, it's an apologist's work and of the type I told you so...I am right and you are wrong but it's a very good read presenting the case from Hyderabad's manner in a compelling manner. Except for the appendices giving the case statements which are a hard nut to crack for a layman, this book is a very good read and is a must for anyone having some interest in Indian history.

History from then IAS officer. Worth reading

This is really an opening to me. I was thinking Hyderabad was assimilated into India in a couple of weeks or months of independence.

This is a vivid description of those critical movements. Second half of the book is more about personal grievance in the form of court documents.

worth reading.
Thanks - Prasad