• 108 Vaishnava Divyakshetrala Yatra Darshini
  • Ebook Hide Help
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • 108 వైష్ణవ దివ్యక్షేత్రాల యాత్రా దర్శిని

    108 Vaishnava Divyakshetrala Yatra Darshini

    Publisher: Victory Publishers

    Pages: 392
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

లోకములో మానవులందరూ కోరుకునేది ఆనందం. సుఖమును కలిగించే అత్యాధునిక సాధనాలు ఎన్ని ఉన్నా అవేవి ఆనందమును ఇవ్వలేవు. ఆనందాన్ని ఇచ్చేది కేవలము ఆధ్యాత్మిక మార్గప్రయాణమే.

“108 వైష్ణవ దివ్యక్షేత్రాల యాత్రా దర్శిని” (దివ్య దేశాల) మేము స్వయంగా అన్ని క్షేత్రాలను దర్శించినపుడు విశేషించి పురాణగాధ తెలుసుకొనుట కష్టమైనది. కారణం సుమారు 80కి పైగా క్షేత్రములు తమిళనాడులో ఉన్నవి. అక్కడి పూజారులు స్థల పురాణాన్ని తమిళములోనే చెప్పుదురు. మనకు అర్థం కాదు. అది ప్రత్యక్షంగా నాకు తెలిసివచ్చింది. అందుకే ఈ దివ్యక్షేత్రాల పుస్తకం వెలుగులోకి తేవాలని ప్రయత్నించగా అనేకమంది పెద్దలు, పిన్నలు సహకరించినారు. ఇది కేవలం సంకలనం మాత్రమే. ఈ పుస్తకములో ప్రతి క్షేత్రానికి ఒక పట్టిక (Table)ను ఇచ్చాము. ఈపట్టికలో తప్పక తెలుసుకోవలసిన/ చూడవలసిన దృశ్యాలు ఇవ్వబడినవి. దానిలో పెరుమాళ్ పేరు, అమ్మవారి పేరు, ఉత్సవమూర్తి పేరు, అక్కడ వుండే పుష్కరిణి, విమానము పేరు, పెరుమాళ్ ఎవరెవరికి ప్రత్యక్షము అయినది, స్వామి ఏ భంగిమలో మనకు సేవచేయు భాగ్యమును ప్రసాదించి దర్శనమిస్తారో, ఏ దిక్కును చూచుచున్నారో, ఎవరు మంగళశాసనములు చేసినారో పూర్తి వివరాలు ఇవ్వడమైనది. ప్రతి క్షేత్రానికి లభించినంత వరకు పురాణగాథ ఇవ్వడమైనది. ఇంకా ఇతర విశేషాలు కూడా తెలియజేస్తూ ఇవ్వడమైనది. తరువాత ఏయే ఉత్సవాలు ఏయే మాసములలో జరుగును వివరములు కూడా ఇవ్వడమైనది. అంతే కాక ప్రతి దివ్య దేశానికి దగ్గరలోని దివ్య దేశాలను కూడా తెలియ జేయడ మైనది. సన్నిధి సమయాలు కూడా పేర్కొనడం జరిగినది. ఏ మార్గమున వెళ్ళాలి ఎక్కడ నుండి వెళ్ళాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది.

ఈ పుస్తకంలో 108 దివ్యదేశాలతోపాటు, ఆచార్యుల వారి అభిమాన క్షేత్రాలు 14, ఆళ్వార్లు 12మంది చరిత్ర ఇవ్వడం జరిగింది. వైష్ణవులకు పరమపవిత్రమైన, ధనుర్మాసములో నిత్యము పఠించే తిరుప్పావై పాశురాలను తాత్పర్యసహితముగా ఇవ్వడం జరిగినది. ఈ పుస్తకం ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశ్యంతో మీముందుకు తీసుకువస్తున్నాము.

- ఇమ్మిడిశెట్టి రామకుమార్

Preview download free pdf of this Telugu book is available at 108 Vaishnava Divyakshetrala Yatra Darshini