
వల్లంపాటి వెంకటసుబ్బయ్య
1937 మార్చి 15 న చిత్తూరు జిల్లా రొంపిచర్ల లో జననం.
2007 జనవరి 2 న మదనపల్లెలో మరణం.
1993లో తాపీ ధర్మారావు అవార్డు, 1995లో కొండేపూడి సాహిత్య సత్కారం, 1997లో తెలుగు యూనివర్శిటీ అవార్డు, 2000లో గజ్జల మల్లారెడ్డి అవార్డు, 2000లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథారచయితగా మొదలై నవలాకారుడిగా మారి, విమర్శకుడిగా తెలుగు సాహిత్యంలో స్థిరపడిన పరిణామ క్రమానికి ఆయన కథలూ, నవలలూ అద్దం పడతాయి. సంప్రదాయం నుంచి మార్క్సిస్టు ఆలోచనా ధోరణికి ఆయన మరలిన వైనాన్ని ఇవి వెల్లడిస్తాయి. వల్లంపాటి వెంకటసుబ్బయ్య విమర్శకుడిగానే ఎక్కువ మందికి తెలుసు. 'కథాశిల్పం', 'నవలాశిల్పం', 'విమర్శాశిల్పం'... ఈ మూడు పుస్తకాలూ తెలుగు విమర్శా సాహిత్యంలో ప్రామాణిక రచనలు. విమర్శా రంగంలోకి అడుగుపెట్టక ముందే ఆయన కథలు రాశారు. నవలలు రాశారు. రాస్తూనే విస్తృతంగా చదువుకున్నారు. ఇంద్ర ధనుస్సు, దూర తీరాలు, మమతలు - మంచుతెరలు, జానకి పెళ్ళి ఆయన నవలలు.
ప్రపంచ చరిత్ర, చరిత్ర అంటే ఏవిటి?, చరిత్రలో ఏమి జరిగింది?, ప్రాచీన భారతదేశం ప్రగతి, సంప్రదాయ వాదం, భారతదేశం చరిత్ర - (ఆర్.ఎస్.శర్మ 2002), బతుకంతా (కన్నడ నవల), లజ్జ వీరి ముఖ్యమైన అనువాదాలు.
బండి కదిలింది, రానున్న శిశిరం, బంధాలు ఈయన సుప్రసిద్ధ కథలు
Books from Author: Vallampati Venkata Subbaiah
- ₹134.4
- ₹134.4
Sir namaste..how to get ur" navala silpham"book..my email id:challasureshkumar84@gmail.com