
యాత్రా కథనాల రచనలో అందెవేసిన చెయ్యి పరవస్తు లోకేశ్వర్. చదువుతున్న "అక్షరాలను ఆచరణలోకి అనువదించుకోడమే యాత్ర", "అక్షరాల అడుగుజాడలను అన్వేషించడమే యాత్ర" అని అంటారు రచయిత. పరదేశీగా దేశదేశాల సరిహద్దులలో, దారి కాని దారులలో ఒంటరి బాటసారిగా తిరగాలనేది రచయిత అంతర్జ్వాల. ప్రపంచ యాత్రికుడు పండిత్ మహామహోపాధ్యాయ్ పండిత్ రాహుల్ సాంకృత్యాయన్ ప్రభావం తనపై చాలా ఉందని రచయిత అంటారు.
రచయిత పుస్తకాల వివరాలు
సలాం హైద్రాబాద్
తెలుగు విశ్వ విద్యాలయం పురస్కారం పొందిన నవల. 2005 జులైలో మొదటి ముద్రణ జరిగిన నాలుగు నెలలకే రెండవ ముద్రణ, ఆ తర్వాత 2010లో మూడవ ముద్రణ జరిగింది. నాలుగు వందల సంవత్సరాల నగర చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలనే గాక ఈ నేలపై కొనసాగిన తిరుగుబాట్లు, ప్రత్యేకంగా 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని, ఇక్కడి ప్రేమ కథలను కండ్లకు కట్టినట్టు వర్ణించడమే గాక రచయిత ఆత్మ కథను కూడా "లోకార్పణం” కావించిన నవల, చారిత్రక పరిశోధనను కాల్పానిక నవలగా మలచిన సృజనాత్మక నవల. హైద్రాబాద్ నగరాన్ని శీర్షమాణిక్యంగా నిలిపిన నవల. వెల రూ.100/-
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర
2002, 2006, 2007 మరియు 2010లో నాల్గవ ముద్రణ పొందిన చారిత్రక పరిశోధనా గ్రంథం. తొలి వర్తమాన తెలంగాణా ఉద్యమానికి ఊతమిచ్చిన తొలి పుస్తకం.
బహమనీల కాలం నాటి ముల్కీ ఉద్యమం, 1952నాటి గైర్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమమే గాక 1969 జై తెలంగాణా ఉద్యమాన్ని ఆనాటి త్యాగాలను వీరులను ఫోటోలతో సహా కండ్లకు కట్టిన పుస్తకం. అశేష తెలంగాణా ప్రజానీకం నచ్చి, మెచ్చి ఆదరించిన పుస్తకం. వెల రూ.50/-
చత్తీస్ఘడ్ స్కూటర్ యాత్ర
2009లో ప్రచురించిన యాత్రాసాహితి. హైద్రాబాద్ నుండి చత్తీస్ఘడ్ లోని బస్తర్ ప్రాంతమంతా సుమారు రెండు వేల కి.మీ.లు స్కూటర్ పై ప్రయాణీంచిన సాహస యాత్రాకథనం. రెండవసారి 2011లో మళ్ళీ దర్శించి రెండవ ముద్రణలో ఆ అనుభవాలను, రంగుల చిత్రాలను పొందుపరిచిన ట్రావెలాగ్. అరణ్యాలను, ప్రకృతిని, ప్రజలను, పురాణ చారిత్రక గాథలను, వీరులను, ప్రజా నాయకులను, ప్రజా ఉద్యమాలను కళ్ళకు కట్టినట్టు చిత్రించి పాఠకులను కూడా తమ వెంట తిప్పుకునే అద్భుత కథనం. యాత్రాకథనం. వెల రూ.100/-
1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు
1857లో హైద్రాబాద్ నగరంలో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన చారిత్రక గాథలు. రాజా వెంకటప్ప నాయక్, సయ్యద్ మౌల్వీ అల్లా ఉద్దీన్, తుర్రేబాజ్ ఖాన్ లాంటి విప్లవ వీరుల సాహస గాథలు, త్యాగాల చరిత్రలు ఈ పుస్తకంలోని విశేషాలు. ఈనాటి తరానికి ఆ తరం చైతన్యాన్ని వారసత్వంగా అందించే కతలు. 2007లో మొదటి ముద్రణ. ఇప్పుడు 2011లోని రెండవ ముద్రణలో చిత్రాలతో సహా వచ్చిన అపురూప పుస్తకం. వెల రూ.50/-
ఒక హిజ్రా కథ
తొలితరం హిందీ, ఉర్దూ కథలను ముఖ్యంగా స్త్రీల రచనలను తెలుగులో అనువదించిన ఉత్తమ కథలు. ఉత్తమమైన అనుసృజన అని పెద్దలచే, పండితులచే ప్రశంసలు పొందిన కథల పుస్తకం. ఇస్మత్ చుగ్తాయ్, ఖుర్రతులైన్ హైదర్, కమలాదాస్, కుష్వంత్ సింగ్, కిషన్ చందర్, అబ్దుల్ జబ్బార్ లాంటి లబ్ద ప్రతిష్టుల కథలను తేట తెలుగులో చదివి ఆనందించవచ్చు. వెల రూ.50/-
ప్రపంచ పాదయాత్రికుడు
అందరికి తెలిసిన అపురూప వ్యక్తుల "వ్యక్తిచిత్రాలు”. ప్రత్యేక కోణం నుండి మనోనేత్రం నుండి హృదయం నుండి వారి హృదయాల్లోకి తొంగి చూసిన రచనలు. అనుభూతి స్పర్శలు, హార్ట్ టచింగ్ స్పర్శరేఖలు. కాళోజీ సోదరులు, విప్లవ ద్వయం కొండపల్లి - సత్యమూర్తి, జగమెరిగిన జర్నలిస్టు జి.కృష్టలనే గాక లోకం చుట్టిన వీరుడిని కూడా మీరు ఈ పుస్తకం ద్వారా కొత్తకోణాలలో దర్శించవచ్చు. వెల రూ.30/-
నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు
ఆ రోజులలో అట్టడుగు జనాలు అగ్గిపిడుగులుగా మారి నిజాంపై బాంబు వేసిన విప్లవ వీరులు నారాయణ్ రావ్ పవార్, జగదీష్ ఆర్య, గండయ్యల ముఖాముఖి ముచ్చట్లు - కథనాలు. వీరేగాక 1948 సెప్టెంబర్ పోలీస్ యాక్షన్ లో మిలటరీ ఊచకోతలకు బలియైనవారు, సాక్షుల కన్నీటి గాథలివి. చరిత్ర తడిసెను రక్తంతో, కన్నీళ్ళతో అన్నట్లు సాగిన వ్యధాభరిత యధార్థ గాథలివి. వెల రూ.30/-
తెలంగాణ ఒక సంభాషణ
వివిధ దిన, వారపత్రికలలో వచ్చిన వ్యాసాలు. కొత్త కోణాలతో సరికొత్త వ్యాఖ్యానాలతో, అమ్ముల పొదిలో ఆలోచనలన్నీ అస్త్రాలే అన్నట్లు రాయబడిన ప్రత్యేక విశ్లేషణాత్మక వ్యాసాలు. తెలంగాణా ఉద్యమాన్ని, నిష్పాక్షికంగా సమీక్షిస్తూ పాజిటివ్ థింకింగ్ తో రాయబడిన వ్యాసాలు. వెల రూ.30/-
ఎవరిది ఈ హైద్రాబాద్
వేయిన్నొక శేష ప్రశ్నలు పేరుతో రెండు ముద్రణలు పొంది అదనపు సమాచారంతో మూడవ ముద్రణగా కొత్త పేరుతో వస్తున్న పుస్తకం. 1956 విలీనానికి ముందే అన్ని రంగాలల్ల హైద్రాబాద్ స్టేట్ ఎలా అభివృద్ది చెంది ఆ తర్వాత కాలంలో ఏ విధంగా విధ్వంసమయ్యిందో వివరంగా స్టాటిస్టిక్స్ తో తెలిపే పుస్తకం. చారిత్రక ఆధారాలు, సమాచారం ఆధారంగా రాయబడిన గ్రంథం. వెల రూ.30/-
హైద్రాబాద్ జనజీవితంలోఉర్దూ సామెతలు
తెలంగాణా ప్రజలు తెలుగులో మాట్లాడుతునే ఉర్దూ సామెతలను ఎలా వాడుతారో, వాటి అర్థాలు, నేపథ్యం వివరించే సామెతలు. తెలుగు పాఠకులకు తొలిసారిగా పరిచయం చేసిన ఉర్దూ సామెతలివి. సంస్కృతిలో భాగమైన సామెతలు విస్మృతిలోకి వెళ్ళిపోతున్న ఈ సందర్భంలో ఈనాటి తరానికి అందిస్తున్న అపురూప కానుకలే ఈ ఉర్దూ సామెతలు. వెల రూ.30/-
Books from Author: Paravasthu Lokeshwar
- ₹270
Sahasayatra book knige lo print book ledandi..plz add this book..mee sridhar