
శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అవధాన విద్యకు రూపురేకలు తీర్చిదిద్ది, వన్నె వాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకరు. ''గోణము (గోచి) కట్టుటాది బుధకోటి నుతింపఁ గవిత్వము'' చెప్పనేర్చిన వారు. సరస చమత్కారవచో మాధురీ ధారలను ఆంధ్రదేశమంతా ఎడతెరిపి లేకుండా వర్షించి, వర్షించి కూడ వట్టిపోని కాలమేఘం. రంగస్థల నాటకాల తరహాలో కాకుండ, శాస్త్రీయ సంగీత ధోరణిలోనూ కాకుండా మృదుగంభీర స్వరంతో, శ్రోతలు ఉఱ్ఱూతలూగేటట్లు రాగచ్ఛాయతో మానసమానందపడేటట్లు పద్యం చదవగలిగిన పండితుడు.
''కవనార్థం బుదయించిన'' వేంకటశాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీప గ్రామం కడియంలో 8, ఆగస్ట్ 1870 నాడు జన్మించారు. తల్లిదండ్రులు చంద్రమ్మ, కామయ్య. బ్రాహ్మణ శాఖలలో ఒకటైన ద్రావిడులలో ఆరామ ద్రావిడ అనే అంతశ్శాఖకు చెందినవారు.
జంటపేర్లు సొంపుగా కుదిరిన అతి కొద్దిమంది భాగ్యశాలురలలో ఒకరు తిరుపతి వేంకట కవులు. మొదట వారు అన్నా కూడా తప్పు లేదేమో. వారు పుట్టింది 19వ శతాబ్దంలో. 1890 నుండి విస్తరించడం మొదలుపెట్టిన వారి కీర్తి కౌముది ధాళధళ్యం ఇప్పటికీ వెలవెలబోలేదు సరికదా ఎప్పటికప్పుడు కొత్త మెఱుగు చూపుతూ ఉంది.
Books from Author: Chellapilla Venkata Sastry
- ₹129.6
I need this book. Please call to 9986238877 if available. Thank you.