దర్శనమ్ మాస పత్రిక

Darshanam Monthly
Publisher: Marumamula Rukmini
ఇప్పుడే ఈ ప్రింట్ మాగజైన్ చందా ఇక్కడే కినిగెపై ఆన్లైనులో కట్టండి, నేరుగా ప్రతి సంచికా పబ్లిషరునుండే మీ ఇంటికి తెప్పించుకోండి!

Choose your subscription from below options
Description

సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడం నైతిక విలువలు, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం తదితర ఉన్నతాశయాలతో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మాస పత్రిక 'దర్శనమ్' .

హిందూ ధార్మిక సమ్మేళనం, అతిరాత్ర మహాయాగం, కోటికుంకుమార్చన, సహస్ర చండీ యాగం, సహస్ర సత్యనారాయణ క్రతువు, లక్ష దీపోత్సవం వంటి అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, వైదిక సేవా కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నది 'దర్శనమ్'.

భోగాయతనమైన పాశ్చాత్య జీవనశైలితో ధార్మిక జీవనం లుప్తమై, ఆత్మోన్నతి లేక పతనావస్థకు చేరుకుంటున్న హైందవ సమాజానికి సంజీవని లాంటిది 'దర్శనమ్' మాస పత్రిక.

ధర్మధరణీ, కర్మభూమీ అయిన భారతదేశాన్ని పునీతం చేస్తున్న విషయాలు అనేకం. పురాణేతి హాసాలు, దర్శనాలూ, మతాలు, ప్రవక్తలూ, యోగిపుంగవులూ, పుణ్యక్షేత్రాలూ, తీర్థాలూ, దేవాలయాలూ, తపోవనాలూ, పుణ్యనదులూ, పర్వతాలూ, సాగరాలూ, సాధుసంతులూ, పీఠాధిపతులు, ఆశ్రమాలూ, తత్త్వోపదేశకులైన గురువులూ, సమాజ సేవా సంస్థలూ, స్వచ్ఛంద సేవకులూ.. ఇలా ఎన్నో... ఎన్నెన్నో... అన్నింటిని దర్శించి వాటిలోని గుణాలను స్పర్శించిన పత్రికా రత్నం 'దర్శనమ్'.

సమాజం బహిర్ముఖమైతే, భగవంతుడు అంతర్ముఖం. బహిర్ముఖులైన సామాజికులకు యోగులకు వలె అంతర్ముఖాలను ప్రసాదించి, అంతర్ముఖ సమారాధ్యులైన దేవతలను ఆత్మలోనే దర్శింపజేసింది 'దర్శనమ్'.

ఈ ప్రపంచమంతా భగవంతుని స్వరూపాన్ని వ్యాఖ్యానించడంతోనే తన జీవన యాత్రను సుఖతరం చేసుకోగలుతుందని నమ్మింది 'దర్శనమ్'. అందుకే ఎందరో ధార్మిక రచయితలు భగవత్తత్త్వ వ్యాఖ్యాతలై 'దర్శనమ్' లో కనబడతారు. సంస్కృతి, సంస్కారం, సంస్కరణం మూడు పాయల వలె కనబడే సారస్వత గంగా ప్రవాహం 'దర్శనమ్'.

Contact: editordarshanam@gmail.com


గమనిక:
దర్శనమ్ మాసపత్రిక తన చందాదారులకు రాబోయే నెల పత్రికని ప్రస్తుత నెల 25 తేదీకల్లా పంపుతుంది. అంటే, మార్చి 2014 సంచిక కాపీలు చందాదారులకు 25 ఫిబ్రవరి 2014 నాటికల్లా పోస్ట్ చేయబడతాయి. 25 వ తేదీ తర్వాత వచ్చిన కొత్త చందాలు ఆపై మాసం నుంచి వర్తిస్తాయి. ఉదాహరణకు, మీరు 29 జనవరి 2014 నాడు చందా చెల్లిస్తే, మీకు మార్చి 2014 నుండి పత్రిక వస్తుంది.

Language:
Telugu
శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక ప్రజాసాహితి మాసపత్రిక దర్శనమ్ మాస పత్రిక స్తీవాద పత్రిక 'భూమిక' వీక్షణం రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక మన ఆరోగ్యం కుటుంబ ఆరోగ్య సంక్షేమ మాసపత్రిక మిసిమి మాసపత్రిక
Don't miss!
Free goodies!
Just purchased ...
Authors ...
Publishers ...
Manchi pustakam books
Comment(s) ...

I'm unable to download file. Only url is downloading.what to do?

విద్యార్థులకు ప్రధాని విలువైన సూచనలు
రైతుల గొప్పతనం పిల్లలకు తెలియాలి
తెలుగు నెలలు..మన సంస్కృతులు ,సంప్రదాయాలు
పిల్లలో హింసాప్రవృత్తిని ఖండిద్దాం
పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ,విద్యార్థులు తప్పక చదవాల్సిన ఉపవాచకం ఈ పుస్తకం.
ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ పుస్తకాన్ని మీ పిల్లలకోసం చదివి వినిపించండి.

Hi sir., this is koutil rithvik., just now i buy this book through online ., but i did't got it., pleas solve my problem

Subscribe
Browse